కేజీఎఫ్-2 ఓవరాల్ వసూళ్లు రూ.1000 కోట్ల గ్రాస్ మార్కుకు రీచ్ అవడం విశేషం. దాంతో ఈ విషయాన్ని టీమ్ అఫీషియల్ గా ప్రకటించి, కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసింది. నిర్మాత విజయ్, డైరక్టర్ ప్రశాంత్ నీల్ తో కలిసి యష్ ఈ సెలబ్రేషన్ చేసుకున్నారు.
సరైన మాస్ సినిమా భాక్సాఫీస్ దగ్గర చేసే మ్యాజిక్ ఏమిటో కేజీఎఫ్ 2 చూపిస్తోంది. ఈ సినిమా ఊహించిన దానికంటే బాక్సాఫీస్ దగ్గర ఎక్కువ సెన్సేషన్ సృష్టిస్తోంది. 10 రోజుల తర్వాత ఈ సినిమా కలెక్షన్స్ చూస్తే ఎవరికైనా దిమ్మ తిరుగుతుంది. కేజీఎఫ్-2 ఓవరాల్ వసూళ్లు రూ.1000 కోట్ల గ్రాస్ మార్కుకు రీచ్ అవడం విశేషం. దాంతో ఈ విషయాన్ని టీమ్ అఫీషియల్ గా ప్రకటించి, కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసింది. నిర్మాత విజయ్, డైరక్టర్ ప్రశాంత్ నీల్ తో కలిసి యష్ ఈ సెలబ్రేషన్ చేసుకున్నారు.
యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'కేజీఎఫ్ 2' తెరకెక్కింది. విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజునే ఈ సినిమా రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ను రాబట్టడం విశేషం. కన్నడలోనే కాదు .. విడుదలైన ప్రతి ప్రాంతంలోను ఈ సినిమా విజయవిహారం చేస్తోంది.
మరో ప్రక్క ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా ఒక్క హిందీ వెర్షన్ మాత్రమే ఇండియాలో రూ.300 కోట్ల వసూళ్లు సాధించి బాలీవుడ్ కు షాక్ ఇచ్చింది. ఇప్పటిదాకా ఇండియాలో హిందీ వరకు ఈ మైలురాయిని అందుకుంది బాహుబలి-2, దంగల్ చిత్రాలు మాత్రమే. ఆ సినిమా జోరు చూస్తుంటే హిందీ వరకే రూ.400 కోట్ల మేర వసూళ్లు రాబట్టేలా కనిపిస్తోంది. దాదాపుగా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయిపోయిన ఈ చిత్రం.. ఫుల్ రన్లో బయ్యర్లకు అన్ని భాషల్లో మంచి లాభాలు అందించడం ఖాయం అంటున్నారు ట్రేడ్ లో .
ఈ చిత్రాన్ని ఒక కన్నడ సినిమాగా కాకుండా తెలుగు సినిమాగానే ప్రేక్షకులు భావిస్తూ ఉండటంతో, కన్నడ స్థాయిలోనే తెలుగులోను ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. మరోపక్క, యశ్ కి పాన్ ఇండియా క్రేజ్ రావడంతో ఆయనతో సినిమాలు చేయడానికి బాలీవుడ్ బడా నిర్మాతలు పోటీపడుతున్నారు. మరి యశ్ ఏ ప్రాజెక్టును ముందుగా లైన్ మీదికి తీసుకుని వస్తాడో చూడాలి.