యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కూడా సూపర్ హిట్టైంది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా, సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
కన్నడ రాకింగ్ స్టార్ గా యష్ "కే జి ఎఫ్: చాప్టర్ 1" సినిమా తో దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నారు. కన్నడలో మాత్రమే కాక ఈ సినిమా మిగతా భాషల్లో కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఎన్నో రికార్డులను సైతం బద్దలుకొట్టిన ఈ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు "కే జి ఎఫ్: చాప్టర్ 2" అనే సినిమా తెరకెక్కింది. యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కూడా సూపర్ హిట్టైంది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా, సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. టీజర్ మరియు ట్రైలర్ లతోనే అంచనాలను మరింతగా పెంచిన ఈ సినిమా తాజాగా ఇవాళ మొన్న ఏప్రిల్ 14, 2022 న విడుదలై భాక్సాఫీస్ దగ్గర రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది.
ఈ నేపధ్యంలో హోంబలే ఫిలింస్.. ఆర్సీబీ కలిసి ప్రేక్షకులకు డబుల్ బోనాంజా ఇచ్చేందుకు ఓ జాయింట్ వెంచర్ లో భాగస్వాములయ్యారు. ఈ క్రమంలో రీసెంట్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ముందు ఆర్సీబీ జట్టు ప్లేయర్స్ అందరికీ కేజీఎఫ్ 2 సినిమాను ఫ్రాంచైజీ స్పెషల్ స్క్రీనింగ్ వేసింది. ఈ సినిమాతో తమకు మనసు కాస్త తేలికపడిందని.. ఇప్పుడు ప్రశాంతంగా ఉందని తెలిపారు. మ్యాక్స్ వెల్, సిరాజ్, హర్షల్ పటేల్ సినిమా నచ్చిందంటూ సంతోషం వ్యక్తం చేశారు. తామంతా కేజీఎఫ్ 3 సినిమా కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఇటీవల సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రొడ్యూసర్ విజయ్ కిర్గందూర్ ఆర్సీబీ, ఎల్ఎస్జీ మధ్య జరిగిన మ్యాచ్‌ను చూసిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా కోసం కూడా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒక అద్భుతమైన కథతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమాలో కూడా ప్రశాంత్ నీల్ హీరో ఎలివేషన్ ల మీద బాగా దృష్టి పెట్టారు. కథను స్ట్రాంగ్ గా నే రాసుకున్న డైరెక్టర్ అంతే స్ట్రాంగా పాత్రలు డిజైన్ చేసారు అని చెప్పవచ్చు. రవి బస్సు రూట్ సంగీతం ఈ సినిమాకి ఆయువు పట్టు . సినిమాటోగ్రాఫర్ పనితనం కూడా సినిమాకి చాలా బాగా ప్లస్ అయ్యింది. ఇక ఈ సినిమాతో 19 ఏళ్లకే ఎడిటర్ గా మారిన ఉజ్వల్ కులకర్ణి మంచి రెస్పాన్స్ ను అందుకున్నారు. "కే జీ ఎఫ్" స్థాయిని నెక్ట్ లెవిల్ కు పెంచిన చిత్రం మాత్రం "కే జి ఎఫ్ చాప్టర్ 2 ".
ఇక మూవీ చూసిన ఆడియన్స్ సినిమా చాలా బాగుంది. హీరో ఇంట్రడక్షన్ సీన్, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ఓ లెవెల్‌లో ఉన్నాయని అంటున్నారు. అలాగే బీజీఎం కూడా అదరిపోయిందంటున్నారు. గ్రాండ్ విజువల్స్‌తో పాటు రాఖీ భాయ్‌గా యశ్- అధీరాగ సంజు బాబా యాక్షన్ ఎపిసోడ్స్ వేరే లెవల్లో ఉన్నాయని చెబుతున్నారు. హీరోకు ధీటుగా విలన్ పాత్ర ఉందని, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పూనకాలు తెప్పిస్తుందట. యశ్, ప్రశాంత్ నీల్ కాంబో మరోసారి మెస్మరైజ్ చేసిందనేది ఆడియన్స్ మాట. శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేష్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. కాగా, 'కేజీఎఫ్ చాప్టర్-2' ప్రీ రిలీజ్ బిజినెస్ 350 కోట్ల వరకు జరిగినట్లు సమాచారం.
