ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ చిత్రం విడుదలైన తర్వాత రెండో పార్ట్ కోసం ఎలా అయితే జనం ఎదురుచూశారో.. దాదుపు అలాంటి అటెన్షనే యశ్ నటించిన కేజీఎఫ్ కూడా రాబట్టుకోగలిగింది. ‘కేజీఎఫ్ చాప్టర్ 1’ ఎంత పెద్ద  సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. వలం కన్నడ భాషలోనే కాకుండా రిలీజైన అన్ని చోట్లా కనక వర్షం కురిపించింది. గోల్డ్ మైన్స్ నేపధ్యంలో ఎదిగిన రాకీ భాయ్ అనే మాఫియా డాన్  కథాంశంతో..తెరకెక్కిన ఈ చిత్రం కేక పెట్టించే స్క్రీన్ ప్లే, అదిరిపోయే డైలాగ్స్‌లో అందర్నీ ఆకట్టుకుంది. 

ఈ సినిమాతో నటుడు యష్ ఫుల్ పాపులర్ అయ్యాడు. దాంతో ‘చాప్టర్ 2’ కోసం వేచి చూసేలా చేసింది. ఎప్పుడెప్పుడు సెకండ్ పార్ట్ వస్తుందా అని ప్రేక్షకులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపద్యంలో ఈ చిత్రం బిజినెస్ ఓ రేంజిలో జరుగుతుందనేది నిజం. ఈ విషయం బేస్ చేసుకుని కొన్ని మీడియా ఛానెల్స్...ఈ సినిమాకు 120 కోట్లు బిజినెస్ జరిగిందంటూ ప్రచారం మొదలెట్టారు. అయితే దీనిపై చిత్రం టీమ్ స్పందించింది. 

ఈ సినిమా శాటిలైట్ బిజినెస్ ఇంకా పూర్తి కాలేదని వెల్లడించింది. దాదాపు 120 కోట్ల మేర డీల్  పూర్తయిందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చిత్రబృందం క్లారిటీనిచ్చింది. ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ఇంకా అమ్మలేదని వెల్లడించారు. అలాగే ఈ సినిమా సీక్వెల్ అంటూ ప్రచారం సాగుతోంది కానీ.. ఇది కేవలం మొదటి భాగానికి ప్రీక్వెల్ మాత్రమే. ఈ ఫ్రాంఛైజీలో మునుముందు వరుసగా సినిమాలు వస్తాయి.. అని వెల్లడించారు. సిరీస్ ని ఆపకుండా కొనసాగిస్తామని అన్నారు.

ఇక ఎప్పుడెప్పుడు సెకండ్ పార్ట్ వస్తుందా అని ప్రేక్షకులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ కరోనా ఎఫెక్ట్ లేకపోతే విడుదల విషయంలో ఇప్పటికే క్లారిటీ వచ్చి ఉండేది.. కానీ కరోనా కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్‌తో సినిమాకు సంబంధించిన అన్ని పనులు ఆగిపోయాయు. ఆదివారం క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం సినిమాల పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో మ్యూజిక్ కంపోజిష‌న్‌ను జ‌రుపుతున్నామ‌ని నిర్మాత‌లు ట్వీట్ చేశారు.
 
 కేజీఎఫ్-2లో ఫేమస్ యాక్టర్లు నటిస్తున్నారని సమాచారం. తాజాగా ఈ సీక్వెల్‌లో తమన్నా యష్‌కి జోడీగా నటిస్తోందని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.  బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ అధిర పాత్రలో నటిస్తున్నారు. అలాగే రమ్యకృష్ణ, రవీనా టాండన్ కూడా సెకండ్ పార్ట్‌లో నటిస్తున్నారని తెలుస్తోంది.