టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్ నేషనల్ అవార్డ్ గెలిచిన అనంతరం తన కెరీర్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటోంది. మహానటి సినిమా సమయంలో కాస్త న్యాచురల్ గా కనిపించిన అమ్మడు ఇప్పుడు సరికొత్త ఫిట్ నెస్ తో దర్శనమిస్తోంది. సైజ్ జీరోకి వచ్చేసి నేటితరం గ్లామర్ హీరోయిన్స్ కి తనదైన శైలిలో పోటీని ఇవ్వడానికి సిద్ధమైంది.అయితే గ్లామర్ డోస్ మాత్రం పెరగకుండా జాగ్రత్తపడుతోంది.

అలాగని గ్లామర్ డోస్ పెరగకుండా జాగ్రత్తపడుతోంది.  గతంలో ఎప్పుడు లేని విధంగా కీర్తి సురేష్ స్లిమ్ గా మారింది. రీసెంట్ గా కొత్త సినిమాకు సంబందించిన ఒక స్పెషల్ లుక్ రిలీజయింది. అందులో కీర్తి న్యాచురల్ లుక్ లో తో కనిపించడంతో ఒక్క సారిగా ఆ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దిల్ రాజు సమర్పణలో తెరకెక్కనున్న ఈ రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీలో కీర్తి న్యాచురల్ గ కనిపించిననున్నట్లు తెలుస్తోంది.  

దీపావళికి సినిమా మొదటి అఫీషియల్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నారు. ఇంకా టైటిల్ సెట్ చేయని ఈ సినిమాలో ఆది పినిశెట్టి - జగపతి బాబు ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. పాపులర్ బాలీవుడ్ డైరెక్టర్ నగేష్ కుకునూర్ ఈ సినిమా ద్వారా టాలీవుడ్ డైరెక్షన్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబందించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. సుధీర్ చంద్ర - శ్రావ్య వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందుతుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.