టాలీవుడ్ సీనియర్ మోస్ట్ డైరెక్టర్ తేజ నెక్స్ట్ ఎలాంటి సినిమా చేస్తాడు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఇటీవల పుట్టినరోజు సందర్బంగా రెండు టైటిల్స్ ని ఎనౌన్స్ చేశాడు. రాక్షస రాజు రావణాసురుడు.. అలిమేలు మంగ వెంకట రమణ అనే టైటిల్స్ తో సినిమాల్ని ప్రకటించాడు. అలాగే గోపీచంద్ - రానా ఇద్దరి పేర్లను రివీల్ చేశారు.

కానీ ఏ సినిమాలో ఎవరు నటిస్తారు అనేది ఇంకా చెప్పలేదు. ఫిల్మ్ నగర్ నుంచి వినిపిస్తున్న టాక్ ప్రకారం గోపీచంద్ తో  చేసే సినిమాకు 'అలిమేలు మంగ వెంకట రమణ' అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయినట్లు సమాచారం. అసలు మ్యాటర్ లోకి వస్తే.. సినిమాలో గోపీచంద్ సరసన మహానటి బ్యూటీ కీర్తి సురేష్ నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.  మొదట కాజల్ ని అనుకున్న తేజ ఆ తరువాత ఆమెను కాదని కీర్తి సురేష్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు టాక్.

ఇకపోతే తేజ చివరగా కాజల్ తో సీత అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా ఆశించినంతగా సక్సెస్ కాకపోవడంతో నెక్స్ట్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. గోపీచంద్ కి కూడా గత కొంత కాలంగా సరైన సక్సెస్ లేదు. అలాగే మహానటి తరువాత కీర్తి తెలుగులో పెద్దగా మెరిసింది లేదు. మరీ తేజ చేయబోయే నెక్స్ట్ సినిమా ఎలాంటి ఈ స్టార్స్ కి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.