అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథగా తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా మహానటి. ఈ సినిమాలో నటించిన కీర్తి సురేష్ తన అద్భుత నటనతో మెప్పించటమే కాదు ఏకంగా జాతీయ ఉత్తమ నటిగా అవార్డును సైతం అందుకుంది. అయితే తరువాత ఆమె మరిన్ని బయోపిక్‌లలో నటిస్తుందంటూ వార్తలు వచ్చిన అవన్నీ రూమర్స్ అంటూ తేలిపోయింది. ప్రస్తుతం కమర్షియల్‌ సినిమాలు మాత్రమే చేస్తున్న ఆ బ్యూటీ త్వరలో మరో లెజెండరీ స్టార్ బయోపిక్‌లో నటించేందుకు రెడీ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది.

సావిత్రి పాత్రకు అద్భుతంగా జీవం పోసిన కీర్తి సురేష్‌, త్వరలో లెజెండరీ నటి, దర్శకురాలు విజయ నిర్మల పాత్రలో నటించనుదంట. 50 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఏకైక మహిళా దర్శకురాలిగా గిన్నిస్‌ రికార్డ్ అందుకున్న విజయ నిర్మల ఎన్నో సూపర్‌ హిట్ చిత్రాల్లో హీరోయిన్‌గా కూడా నటించింది. అంతేకాదు సూపర్‌ స్టార్‌ కృష్ణ హీరోగా ఆమె తెరకెక్కించిన ఎన్నో చిత్రాలు సిల్వర్ జూబ్లీలుగా నిలిచాయి. ఇటీవల మరణించిన ఈమె జీవిత కథను సినిమాగా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నాడు నటుడు నరేష్.

ఈ సినిమాలో కీర్తి సురేష్ విజయ నిర్మాత పాత్రను పోషిస్తే ఆ పాత్రకు న్యాయం చేయటంతో పాటు సినిమాకు హైప్‌కూడా వస్తుందని భావిస్తున్నాడట. అయితే ప్రస్తుతానికి కేవలం ఈ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉంది. ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహించనున్నారు. నిర్మాత ఎవరు అన్న దాన్ని బట్టి కీర్తి ఈ ప్రాజెక్ట్ కు ఓకె చెప్పే అవకాశం ఉంది.