'వివేకం' ఫేమ్ శివ తమిళంలో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. శివ వరుసగా అజిత్ తో సినిమాలు చేసి విజయాలు అందుకున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వివేకం, వేదాళం, విశ్వాసం లాంటి హిట్ చిత్రాలు వచ్చాయి. మాస్ కథలని స్టైలిష్ గా తెరకెక్కించడంలో శివ సిద్దహస్తుడిగా మారిపోయారు. 

ప్రస్తుతం ఈ దర్శకుడు ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ ని డైరెక్ట్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించబోతున్న తలైవా 168వ చిత్రం గురించి ఆసక్తికర విశేషాలు బయటకు వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితమే పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం లాంఛనంగా ప్రాంభమైంది. 

దర్శకుడు శివ ఈ చిత్రం కోసం క్రేజీ కాంబినేషన్ ని సిద్ధం చేశాడు. సీనియర్ హీరోయిన్లు ఖుష్బూ, మీనా ఈ చిత్రంలోనటిస్తున్నారు. అలాగే కీర్తి సురేష్ కూడా ఈ చిత్రంలో నటించనుంది. కానీ ఎవరి పాత్రలు ఏంటనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. 

రజనీకాంత్ చెల్లిగా కీర్తి సురేష్ ఈ చిత్రంలో నటించబోతోంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇది కాస్త సర్ ప్రైజింగ్ గా అనిపించే అంశమే. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న కీర్తి సురేష్.. చెల్లి పాత్రకు అంగీకరించిందా అనే సందేహం కలగక మానదు. రజని తల్లిదండ్రులకు కీర్తి సురేష్ లేటుగా పుడుతుందని అంటున్నారు. 

ఈ లెక్కన ఖుష్బూ, మీనా హీరోయిన్లుగా నటించే అవకాశం  జరుగుతోంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో దర్శకుడే క్లారిటీ ఇవ్వాలి. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఖుష్బూ, 24 ఏళ్ల తర్వాత మీనా రజనీకాంత్ సరసన నటించనుండడం విశేషం. ఇమాన్ ఏఈ చిత్రానికి సంగీత దర్శకుడు.