సౌత్ ఇండస్ట్రీలో బాక్స్ ఆఫీస్ హిట్స్ తో దూసుకుపోతున్న క్యూట్ బ్యూటీ కీర్తి సురేష్. ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకొని జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్నఈ మహానటి ఇప్పుడు బాలీవుడ్ సినిమాతో రెడీ అవుతోంది. సౌత్ లో సక్సెస్ అయినట్టుగానే నార్త్ లో కూడా మంచి విజయాలు అందుకోవాలని ఈ మలయాళీ బ్యూటీ ఫిట్ నెస్ లో మార్పులు కూడా తెచ్చింది.   

గోల్డెన్ డేస్ ఫుట్ బాల్ (1952-62) బ్యాక్ డ్రాప్ లో అజయ్ దేవగన్ కొత్త చిత్రం "మైదాన్" తెరక్కుతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలక్రితం మొదలైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. రీసెంట్ గా ఫస్ట్ షెడ్యూల్ ని పూర్తి చేశారు. ఇక వీలైనంత త్వరగా మరో షెడ్యూల్ ని మొదలుపెట్టి షూటింగ్ కి ఎండింగ్ కార్డ్ వేయాలని అనుకుంటున్నారు. సినిమాలో కీర్తి సురేష్ అజయ్ దేవ్ గన్ సతీమణిగా కనిపించబోతోంది. 

ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని కీర్తి ఆశపడుతోంది.   బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోణి కపూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహించనున్నారు. సినిమా షూటింగ్ ని వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది మొదట్లోనే సినిమాను రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేసుకుంటున్నారు. మరి ఈ సినిమాతో కీర్తి సురేష్ బాలీవుడ్ లో ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి.