రాజమౌళి ఫ్యామిలీ నుంచి మొదటిసారి ఒక కథానాయకుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సీనియర్ సంగీత దర్శకుడు కీరవాణి కుమారుడు శ్రీ సింహా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన మత్తు వదలరా అనే సినిమా టీజర్ ని నేడు విడుదల చేశారు. 

అతి నిద్ర కారణంగా కలిగే పరిణామాలు సినిమాలో మెయిన్ పాయింట్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. హీరో శ్రీ సింహా చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. కథ డిఫరెంట్ గా ఉండడంతో ఆడియెన్స్ లో స్పెషల్ ఎట్రాక్షన్ ని కలిగిస్తుందని చెప్పవచ్చు. చిత్ర యూనిట్ కి పనిచేసినవారంతా దాదాపు కొత్తవారే. మొదటి సినిమాతోనే ఒక డిఫరెంట్ జానర్ ని టచ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు కీరవాణి పెద్ద కుమారుడు కాల భైరవ మ్యూజిక్ అందిస్తున్నాడు. 

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో తన పనితనాన్ని చూపిస్తున్నాడు. ఇటీవల రిలీజైన పోస్టర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు టీజర్ కి కూడా పాజిటివ్ టాక్ వస్తోంది. వరసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో వెలుగుతున్న  ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్‌ సంస్ద కేవలం కోటి రూపాయల బడ్జెట్ తో  ఈ సరికొత్త ప్రయోగాన్నీ నిర్మిస్తోంది. కంటెంట్ డ్రైవన్ ఫిల్మ్ గా రూపొందుతున్న ఈ చిత్రం కొత్త వాళ్లతో రూపొందనుంది.  

రితేష్‌ రానా అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. టీజర్  చూస్తుంటే సినిమాలో కొత్త తరహా కంటెంట్ ఉన్నట్లు అర్ధమవుతోంది. సినిమాలో ఒక న్యూ ఏజ్ లవ్ స్టోరీ కూడా ఉండబోతుందట. తెలుస్తోంది. యూత్ ఎదుర్కొంటున్న నిద్ర అనే  ఓ చిత్రమైన సమస్యను  సినిమాలో ప్రస్తావించనున్నట్లు చెప్తున్నారు. 

యూత్ టార్గెట్ సాగే ఈ సినిమా క్లిక్ అయితే మరిన్ని కంటెంట్ బేసెడ్ సినిమాలు చేయాలని ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు సమాచారం.    దాంతో  కొత్త తరహా కథాంశాలతో విల‌క్ష‌ణ‌మైన సినిమాలు నిర్మించడానికి కొన్ని కథలు ఎంపిక చేసి , ఈ సినిమా మొదట ట్రైల్ క్రింద వదులుతున్నట్లు వినికిడి. న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్, మోహ‌న్ ఈ సినిమాపై మంచి నమ్మకంగా ఉన్నారు. మరి సినిమా ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.