Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ డెసిషన్ మెగాస్టార్ కి వరం

దసరా సెలవులు పూర్తై,  సోమవారం నుంచి పాఠశాలలు తెరుచుకోవాలి. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా జోరుగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ఇలాంటి సమయం లో స్కూల్స్, కాలేజీలు తెరుచుకుంటే అది మరింత ఇబ్బందిని, ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తుంది. 

KCR decision benefit to Syeraa collections
Author
Hyderabad, First Published Oct 13, 2019, 1:16 PM IST

దసరా సెలవులు పూర్తై,  సోమవారం నుంచి పాఠశాలలు తెరుచుకోవాలి. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా జోరుగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ఇలాంటి సమయం లో స్కూల్స్, కాలేజీలు తెరుచుకుంటే అది మరింత ఇబ్బందిని, ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తుంది. అందుకే సెలవుల్ని 19వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది ప్రభుత్వం.  దాంతో అక్టోబర్ 14 నుంచి ఓపెన్ కావాల్సిన స్కూల్స్ మరో ఇప్పుడు అక్టోబర్ 19 వరకు మూత పడనున్నాయి.  స్కూల్ బస్సుల్ని ఆర్టీసీ యాజమాన్యం తీసుకొని తిప్పుకోంది.  

దాంతో  తెలంగాణలో స్కూల్, కాలేజీ పిల్లలకు మరో వారం రోజులు అదనపు రెస్ట్ దొరికింది . ఆర్టీసీ సమ్మెను దృష్టిలో పెట్టుకొని తీసుకున్న ఈ నిర్ణయం, నైజాంలో సైరాకు ప్లస్ అవుతుందని ట్రేడ్ భావిస్తోంది.  . దసరా సీజన్ అయిపోయి కాస్త డల్ అయిన మార్కెట్ కి, ఈ వారం రోజులు ఎక్స్ట్రా బోనస్ గా దొరికాయి. బస్సులు లేకపోవడం, బయట ధర్నాలు జరగడంతో వేరే దారిలేక చాలా మంది థియేటర్స్ వైపు అడుగులు వేస్తారని అంటున్నారు. ఇది సైరా సినిమా బిజినెస్ ని పెంచే అవకాశం ఉందని ట్రేడ్ లో అంచనాలు వేస్తున్నారు.  

సైరా సినిమా చిరంజీవికి నటుడుగా చాలా పేరు తెచ్చిన సంగతి తెలిసిందే. ఆయన నటించిన బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. మెగాస్టార్ కి ఈ సినిమా ఒక డ్రీం ప్రాజెక్ట్. గత 12 ఏళ్లుగా తీయాలనుకొని ఇప్పటికీ సాధించారు.

ఇక అమెరికాలో మాత్రం  సైరా నిరాశపరిచింది. ప్రస్తుతం అమెరికా మార్కెట్  గొప్పగా లేదు. అందుకే.. ఈ సినిమాకి మంచి రేటింగ్స్ వచ్చినా కూడా వసూళ్ల పరంగా డల్ అనిపించుకున్నాయి. ఇప్పటివరకు 2.33 మిలియన్ డాల్లర్లను రాబట్టింది.  

Follow Us:
Download App:
  • android
  • ios