కరోనా భయంతో సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. మొదట్లో ఎక్కువగా వర్క్‌ అవుట్‌ వీడియోలను పోస్ట్ చేసిన సెలబ్రిటీలు తరువాత తాము ఇళ్లలో పనులు చేసుకుంటున్న వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. గురువారం రాత్రి దీపికా తన ఇన్‌స్టాగ్రామ్‌ లో కత్రినా కైఫ్‌ వీడియోను షేర్ చేసింది. కత్రినా అంట్లు తోముతున్న వీడియోను తన ఇన్‌ స్టాలో షేర్ చేసింది దీపిక. గతంలో ఇదే వీడియోను కత్రినా తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. అయితే దీపికి క్యాట్ వీడియోను షేర్‌ చేస్తూ నా ఐడియానే కత్రినా కాపీ చేసిందంటూ సరదాగా కామెంట్ చేసింది. 

ఇటీవల ఈ ఇద్దరు ముద్దుగుమ్మల మధ్య తరచూ సోషల్ మీడియా సంభాషణలు జరుగుతున్నాయి. ఇటీవల తన సొంత బ్యూటీ లైన్‌ ను ప్రారంభించిన సందర్భంగా కత్రినాను ప్రశంసించింది దీపికా. గతంలో వీరి కాఫీ విత్ కరణ్ సందర్భంగా కత్రినపై దీపిక చేసిన వ్యాఖ్యల వివాదాస్పదమయ్యాయి. నాకు కత్రినా పాస్‌ పోర్ట్ చూడాలని ఉంది అంటూ దీపిక అనటం సంచలనంగా మారింది. దీంతో దీపికా, కత్రినా మధ్య కోల్డ్ వార్ జరుగుతుందన్న ప్రచారం జరిగింది.
 

అయితే 2018లో దీపికా రణవీర్‌ల రిసెప్షన్‌కు కత్రినాకు ఆహ్వానం అందటం కత్రినా కూడా ఆ వేడుకలో సందడి చేయటంతో రూమర్స్ కు తెరపడింది.  కత్రినా చివరగా సల్మాన్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన భారత్‌ సినిమాలో కనిపించింది. తాజాగా ఈ భామ నటించిన సూర్యవంశీ సినిమా కరోనా ఎఫెక్ట్ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమా త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక దీపికా విషయానికి వస్తే ఇటీవల చపాక్ సినిమాతో ఆకట్టుకున్న ఈ భామ భర్త రణవీర్‌తో కలిసి 83 సినిమాలో నటిస్తోంది.