‘భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం’ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై మరో విభిన్నమైన చిత్రానికి రంగం సిద్దమైంది.  ‘ఆర్.ఎక్స్ 100’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ హీరోగా తెరకెక్కబోతున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌశిక్ పెగళ్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు.

ఆర్ఎక్స్ 100 అనే రొమాంటిక్ ఎంట‌ర్‌టైనర్‌తో హిట్ కొట్టిన కార్తికేయ ఆ త‌ర్వాత ఆ స్దాయి సినిమాల‌ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రాలేక‌పోతున్నాడు. రీసెంట్ గా కార్తికేయ నటించిన 90 ఎంఎల్ చిత్రం సైతం డిజాస్టర్ అయ్యి కూర్చుంది. ఈ నేపధ్యంలో తన కెరీర్ కు  మంచి హిట్ కోసం ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తున్నాడు కార్తికేయ. ఈ క్రమంలో ఆయన దగ్గరకు ఈ ఆఫర్ వచ్చింది. వెంటనే ఓకే చేసారు. ఈ సినిమాకు సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చింది.


ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు కౌశిక్. 2020లో షూటింగ్ జరుపుకోనున్న ఈ మూవీ డిఫెరెంట్ స్టోరీ లైన్ తో తెరకెక్కనుంది . ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా ఈ చిత్రం రూపొంద‌నుంది. బ‌స్తీ బాలరాజు పాత్ర‌లో కార్తికేయ  కనిపించనున్నాడు.