Asianet News TeluguAsianet News Telugu

‘90 ఎమ్‌.ఎల్‌’ కలెక్షన్స్ అంత దారుణమా?

‘ఆర్‌.ఎక్స్‌.100’  చిత్రంతో పరిచయమైన కార్తికేయ ఆ సినిమాతో పెద్ద హిట్ కొట్టాడు. ఆ తర్వాత వచ్చిన హిప్పీ, గుణ 369, విలన్ గా చేసిన గ్యాంగ్ లీడర్ చిత్రాలు పెద్దగా వర్కవుట్ కాలేదు. ఈ నేపధ్యంలో కార్తికేయ తన సొంత బ్యానర్ లో  ‘90.ఎమ్‌.ఎల్’ టైటిల్ తో సినిమా చేసారు. 

Karthikeya's 90 ML slows down in no time
Author
Hyderabad, First Published Dec 8, 2019, 4:26 PM IST

 ‘ఆర్‌.ఎక్స్‌.100’  చిత్రంతో పరిచయమైన కార్తికేయ ఆ సినిమాతో పెద్ద హిట్ కొట్టాడు. ఆ తర్వాత వచ్చిన హిప్పీ, గుణ 369, విలన్ గా చేసిన గ్యాంగ్ లీడర్ చిత్రాలు పెద్దగా వర్కవుట్ కాలేదు. ఈ నేపధ్యంలో కార్తికేయ తన సొంత బ్యానర్ లో  ‘90.ఎమ్‌.ఎల్’ టైటిల్ తో సినిమా చేసారు. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి రివ్యూలు పాజిటివ్ గా రాలేదు. కాకపోతే ఫస్ట్ డే కలెక్షన్స్ మాత్రం బాగున్నాయి. అయితే రివ్యూలు, మౌత్ టాక్ ప్రభావం రెండో రోజు నుంచే కనపడింది. శనివారం ఈ సినిమా డ్రాప్ కనపడింది. దాదాపు యాభై శాతం ఆక్యుపెన్సీ రేటు పడిపోయింది. అసలే సినిమాలకు పెద్దగా గిరాకీ లేని నెల నవంబర్. దానికి తోడు విషయం లేని సినిమా విసిగించటంతో మినిమం కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయిందీ చిత్రం.

ఇక ఈ సినిమా ఫ్లాఫ్ కావటంతో కార్తికేయ కెరీర్ కు పెద్ద దెబ్బే.  ‘ఆర్‌.ఎక్స్‌.100’  చిత్రం కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా కావటంతో కార్తికేయ బాగా చేసాడన్నారు తప్ప..అతని గురించే ఆడింది అన్నవారు లేరు. అయితే అతన్ని చూపించి బిజినెస్ చేయవచ్చు అనుకుని నిర్మాతలు ఫిక్స్ అవటంతో వరస ఆఫర్స్ వచ్చాయి. విభిన్నమైన కథాంశాలు అంటూనే పక్కా రొటీన్ మాస్ సినిమాలు చేసి తన కెరీర్ ని తనే పాడు చేసుకున్నాడు కార్తికేయ. గుణ 369, 90 ఎమ్ ఎల్ రెండూ రొటీన్ మాస్ సినిమాలే కావటం చెప్పుకోదగ్గ విషయం.

మ‌ద్యానికి బానిసైన ఓ కుర్రాడి క‌థ‌తో 90 ఎమ్ ఎల్ సినిమాని రూపొందించారు దర్శకుడు శేఖ‌ర్‌రెడ్డి ఎర్రా. ఈ సినిమాలో కార్తికేయ సరసన నేహ సోలంకి హీరోయిన్ గా చేసింది. కార్తికేయ క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాకంపై అశోక్‌రెడ్డి గుమ్మకొండ నిర్మించారు.   ఇదొక క‌ల్పిత క‌థ‌. త‌న కొడుక్కి పాలు ఇవ్వాల్సిన త‌ల్లి, మ‌ద్యం గ్లాసు అందించాల్సిన ప‌రిస్థితి వ‌స్తే ఆ త‌ల్లి భావోద్వేగాలు ఎలా ఉంటాయి? అలాంటి కొడుకు జీవితం ఎలా ఉంటుంద‌నే అంశాల్ని ఆధారంగా చేసుకొని తెర‌కెక్కించారు. అలాగ‌ని ఇదేం పూర్తిగా తాగుబోతు క‌థ కాదు. ఆ నేప‌థ్యంలో సాగుతుందంతే. హాస్యం పంచ‌డ‌మే ల‌క్ష్యంగా రూపొందించిన చిత్రమిది. దేవ‌దాస్ పాత్రలో కార్తికేయ చాలా బాగా న‌టించాడు. క‌ల్పిత క‌థే అయినా... వాస్తవిక‌త ఉట్టిప‌డేలా తెర‌కెక్కించే ప్రయత్నం చేసారు.

Follow Us:
Download App:
  • android
  • ios