బుల్లి తెరపై ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ హవా కొనసాగుతోంది. రాత్రి 7:30 అయిందంటే ఇంటిల్లిపాది టీవీలకు అతుక్కుపోతున్నారు. కార్తీక దీపం సీరియల్ ప్రేక్షకులపై అంతలా ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ కు రికార్డు స్థాయిలో టిఆర్పి రేటింగులు నమోదవుతున్నాయి. 

తెలుగు టీవీ రంగం చరిత్రలో ఇంతవరకు సాధ్యం కానీ టిఆర్పి రేటింగులని కార్తీకదీపం సొంతం చేసుకుంటోంది. మరే ఇతర సీరియల్ కార్తీకదీపంకు పోటీ ఇవ్వలేకపోతోంది. కార్తీక దీపం దెబ్బకు బ్లాక్ బస్టర్ చిత్రాలు కూడా నిలబడలేకపోతున్నాయి. 

అక్టోబర్ 13న ఓ ప్రముఖ ఛానల్ లో ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని ప్రసారం చేశారు. మిగిలిన చిత్రాలతో పోల్చుకుంటే ఇస్మార్ట్ శంకర్ మూవీకి హైయెస్ట్ టిఆర్పి రేటింగ్స్ నమోదయ్యాయి. ఇస్మార్ట్ శంకర్ చిత్రం అత్యధికంగా 16.3 రేటింగ్ సాధించింది. ఇది అద్భుతమైన రికార్డే. కానీ బ్లాక్ బస్టర్ మూవీ అయిన ఇస్మార్ట్ శంకర్ చిత్రానికే షాక్ ఇచ్చేలా కార్తీకదీపం సీరియల్ 18.3 రేటింగ్ సాధించడం విశేషం. 

దీనినిబట్టే అర్థం చేసుకోవచ్చు తెలుగు ప్రేక్షకులు ఈ సీరియల్ ఎంతలా నీరాజనాలు పడుతున్నారో అని. ఈ సీరియల్ లో ప్రధాన పాత్రలో నటిస్తున్న నిరుపమ్, ప్రేమి విశ్వనాథ్ పాత్రలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. సగటున ఈ సీరియల్ కు ప్రతి రోజు 15 టిఆర్పి రేటింగ్ తగ్గడం లేదట. 

పూరి జగన్నాధ్ దర్శత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ మూవీ ఈ ఏడాది విడుదలై ఘనవిజయం సాధించింది. రామ్ లుక్, హీరోయిన్లు నభా, నిధి అగర్వాల్ గ్లామర్ ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.