బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ... టాప్ రేసులో దూసుకుపోతున్న టీవీ సీరియల్ కార్తీక దీపం.  భార్య, భర్త, వారి పిల్లలు, ఓ చక్కని కుటుంబం నేపథ్యంలో సాగుతున్న ఈ సీరియల్.. ఈ రోజు రాత్రి ఎపిసోడ్ మీకోసం  ముందుగానే...

గత ఎపిసోడ్ లో... శౌర్య కోసం వెతుకుతూ దీప ఇంటికి చేరుకునే సరికి... శౌర్య అక్కడ  కూర్చొని ఉంటుంది. తన కూతురి పరిస్థితి చూసి దీప కన్నీరు పెట్టుకుంటుంది. సౌందర్య కూడా శౌర్యను వెతుకుతూ దీప ఇంటికి చేరుతుంది. అప్పటికే నిజం తెలుసుకున్న శౌర్య ఏమీ తెలియనట్లుగానే నటిస్తూ.. దీప, సౌందర్యలకు చురకలు అంటిస్తుంది.

నేటి ఎపిసోడ్ లో.... దీప, శౌర్యలు పడుతున్న బాధని చూసి ఆదిత్య చలించిపోతాడు. తీవ్ర ఆవేశంతో భార్య శ్రావ్య దగ్గరకు వెళతాడు. ఎలాగైనా నిజం శౌర్యకు చెప్పేస్తానంంటూ ఊగిపోతాడు. అన్నీ ఉన్నా... అందరం ఉన్నా కూడా శౌర్య అన్ని కష్టాలు పడాల్సిన అవసరం ఏమీ లేదంటాడు. అయితే.... ఆదిత్య కోపాన్ని తగ్గించేందుకు శ్రావ్య ప్రయత్నిస్తుంది.

అత్తయ్య గారికీ అన్నీ తెలుసు అని... ఏ పని చేయాలన్నా ఆమె అన్నీ ఆలోచించి చేస్తారని... తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దంటూ... శ్రావ్య.. ఆదిత్యకు చెబుతుంది. ఆమె మాటలకు శాంతించిన ఆదిత్య.. ఇంటికి వెళ్లిపోతాడు.

మరోవైపు హిమ.. పుస్తకాలు తీసి చదువుకుంటూ ఉంటుంది. ఏదో డౌట్ వచ్చి మధ్యలో.. శౌర్య రాసుకొని ఉంటుంది చూద్దామని అనుకుంటుంది. అలా బ్యాగ్  ఓపెన్ చేసినప్పుడు.. హిమకి.. శౌర్య డ్రాయింగ్ బుక్ కనపడుతుంది. అందులో తండ్రి కోసం శౌర్య ఎంతగా ఎదురు చూస్తుందో స్పష్టంగా అర్థమౌతోంది. 

మరో వైపు శౌర్య ఉదయం నుంచి ఎక్కడికి వెళ్లి ఉంటుందని దీప ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా శౌర్యకి భోజనం పెట్టేటప్పుడు అడిగి తెలుసుకోవాలని అనుకుంటుంది. అయితే... దీప ప్లాన్ ని శౌర్య బెడిసి కొడుతుంది. తాను ఎక్కడికి వెళ్లాను అన్న విషయం చెప్పకుండా తల్లిదగ్గర దాచేస్తుంది.

ఇదిలా ఉండగా.. హిమ  పుస్తకాలు సర్దుకుంటుండగా... సౌందర్య, ఆనందరావులు చూస్తారు.  అక్కడ సౌర్య డ్రాయింగ్ బుక్  వాళ్ల కంట పడుతుంది. అది చూసి... సౌందర్య, ఆనందరావులు బాధపడిపోతారు. ఈ రోజు ఎలాగైనా కార్తీక్ తో మాట్లాడాలని సౌందర్య నిర్ణయించుకుంటుంది.

అప్పటికే మద్యం సేవించి... కార్తీక్ ఇంటికి చేరుకుంటాడు. ఇంటికి వచ్చిన కార్తీక్ తో సౌందర్య కాసేపు మాట్లాడాలని అడుగుతుంది. చెప్పు మమ్మీ అని కూర్చుంటాడు. ఎందుకు తాగి వచ్చావు అని నేను అడగను అంటూనే... నీతో ఓ విషయం మాట్లాడాలని చెబుతుంది. శౌర్య ఇంటి గుమ్మం ముందు అలసిపోయి కూర్చుండగా,.. దీప ఏడుస్తున్నప్పుడు తీసిన వీడియోని కార్తీక్ కి చూపిస్తుంది.

రేపటి ఎపిసోడ్ లో...  మన ఇంటికి ఎలాంటి ఉసురు, శాపం తగలకూడదు అంటే.. దీప, దాని కూతురు శౌర్య.. మన ఇంటి గడప తొక్కడానికి కూడా వీలు లేదని చెబుతాడు. కార్తీక్ మాటలకు కోపంతో ఊగిపోయిన సౌందర్య చెంప పగలకొడుతుంది. దానిని ప్రత్యక్షంగా చూసిన హిమ.. తన తండ్రి చెయ్యి పట్టుకొని.. నానమ్మ సౌందర్య వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. కార్తీక దీపం కొనసాగుతోంది.