బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ కార్తీక దీపం. రోజు రోజుకీ ఊహించని ట్విస్టులతో అదరగొడుతోంది. అనుమానంతో భార్యను భర్త దూరం పెట్టేస్తే... తెలీకుండానే ఆ తల్లిదండ్రులను కలపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నేటి రాత్రి రాబోయే ఎపిసోడ్ ముందుగానే మీకోసం ఏషియానెట్ అందిస్తోంది.

గత ఎపిసోడ్ లో.... శౌర్య కనిపించడం లేదంటూ దీప.. హాస్పిటల్ లో ఉన్న కార్తీక్ దగ్గరకు వెళ్తుంది. కలిసి వెతుకుదాం.. పోలీసు కంప్లైంట్ ఇద్దామని అడుగుతుంది. కాగా... దీప ఆవేదనను కార్తీక్ పట్టించుకోడు. మరోవైపు గుడి నుంచి పరధ్యానంగా నడుచుకుంటూ శౌర్య ఇంటికి వెళ్తూ ఉంటుంది. తనకు ఎదురుగా కార్తీక్ నడుచుకుంటూ రావడం తన కంట పడుతుంది. వెంటనే నాన్న అంటూ పరుగులు తీస్తుంది.

నేటి ఎపిసోడ్ లో....కార్తీక్ కనపడగానే... నాన్న అంటూ శౌర్య పరుగులు తీస్తుంది. మీరే మా నాన్న కదా. ఈ విషయం మీరు ముందే ఎందుకు చెప్పలేదు. చాలాసార్లు మీరు నన్ను రౌడీ అని పిలిచారు కదా... కానీ ఎందుకు మీరే మా నాన్న అని చెప్పలేదు. నేను ఏం తప్పు చేశాను? మీకు డబ్బు ఉంది.. మంచి వారు.. మీరంతా బంగ్లాలో ఉంటారు.. మరి నేను.. మా అమ్మ మాత్రం బస్తీలో ఉంటాం  అంటూ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.

ఈ విషయం నీకు ఎవరు చెప్పారని కార్తీక్ ప్రశ్నించగా... ఇందాక మీరు అమ్మతో మాట్లాడటం నేను విన్నాను. ఆధార్ కార్డులో అడ్రస్ చూసి నేను ఇంటికి వచ్చాను. అప్పటికే అమ్మ అక్కడ ఉంది. నేను మీకు ఎందుకు వద్దు నాన్న..? మీరు అమ్మని వదిలేశారా...? అని అడుగుతుంది. కాగా.. శౌర్య మాటలకు కార్తీక్ కి బాగా కోపం వస్తుంది. ఎవరు నీకు నాన్న అంటూ గట్టిగా అరుస్తాడు. శౌర్య చేతిలోని ప్రసాదం పక్కకు తోసేస్తాడు. నన్ను ఇంకోసారి నాన్న అని పిలవద్దు అంటూ అరిచేస్తాడు. దీంతో.. ఒక్కసారిగా శౌర్య ఉలికిపడుతుంది. అయితే... అదంతా శౌర్య కల. కార్తీక్ ని నాన్న అని పిలిస్తే... ఇలా జరుగుతుందని ఊహించుకుంటుంది.

వెంటనే నాన్న అని పిలవకుండా  ఉండిపోతుంది. తల్లి, తండ్రి ఒక్కటై.. తనను ప్రేమగా చూసుకుంటే ఎంత బాగుంటుందని ఊహించుకుంటుంది. అలా శౌర్య నడుచుకుంటూ వెళ్తుంటే... పక్క నుంచి వెళ్తున్న కార్తీక్ చూస్తాడు.

కార్తీక్ ని చూసినా కూడా చూడనట్లుగా శౌర్య వెళ్లిపోతుంటే కార్తీక్ ఆపుతాడు. రౌడీ.. ఎక్కడికి వెళ్లావు అని అడుగుతాడు. గుడికి వెళ్లాను డాక్టర్ బాబు అని చెబుతుంది. స్కూల్ కి వెళ్లకుండా గుడికి ఎందుకు వెళ్లావు అని అడుగుతాడు. మా నాన్న కోసం వెళ్లాను.. ఆ దేవుడిని అడగడానికి వెళ్లాను అని చెబుతుంది. మీ నాన్న రాడు రౌడీ.. నువ్వు ఇంటికి వెళ్లిపో... అని చెబుతాడు. మీకు చెప్పాడా డాక్టర్ బాబు.. మా నాన్న రాడని మీకెలా తెలుసు అని అడుగుతుంది.

మీ అమ్మ చెప్పలేదా అని అడుగుతాడు. మీరు  చెప్పారా అని ఎదురు ప్రశ్నిస్తుంది. మా నాన్న ఎవరో మీకు తెలుసు కదా... ఇతనే మీ నాన్న అని ఏ రోజైనా నాకు చెప్పారా అని ఎదురు ప్రశ్నిస్తుంది. మా నాన్నకు నేను అవసరం లేదా..? అని అడుగుతుంది. నువ్వు చిన్న పిల్లవు రౌడీ... అవన్నీ మీ అమ్మ చూసుకుంటుంది.. నువ్వు ఇంటికి వెళ్లు అని చెబుతాడు. దానికి శౌర్య.. నేను చిన్నపిల్లనే కదా.. నాకు ఏమీ తెలీదు కదా.. అయినా నేను ఎందుకు వద్దు మా నాన్నకి అని ప్రశ్నిస్తుంది.

శౌర్య అడిగే ప్రశ్నలకు సమాధనం చెప్పలేకపోతాడు కార్తీక్. చివరగా శౌర్య.. మీరు మంచివారే కదా డాక్టర్ బాబు.. కొంచెం మాత్రమే మంచి వారా అని అడుగుతుంది. వాటికి సమాధానం చెప్పకుండా ఇంటికి వెళ్లు అని మాత్రమే అంటాడు.

శౌర్య అక్కడి నుంచి వెళ్లిపోయాక... రౌడీ ఎందుకు ఇలా మాట్లాడుతోంది..? ఎప్పుడూ లేదని కొత్తగా ఎందుకు చూస్తోంది అని తనలో తానే మాట్లాడుకుంటాడు కార్తీక్.

ఇదిలా ఉండగా.. దీప.. శౌర్య కోసం స్కూల్ దగ్గర వెతుకుతూ ఉంటుంది. మరోవైపు హిమ.. శౌర్య బ్యాగ్ తీసుకొని  ఇంటికి వెళ్తుంది. ఈ బ్యాగ్ ఎవరిది అని అడిగితే.. శౌర్య ది అని చెబుతుంది. శౌర్య.. ఉదయం స్కూల్లో బ్యాగ్ పెట్టి మళ్లీ తిరిగి రాలేదని చెబుతుంది. దీంతో... శౌర్య కనపడకుండా పోయిందన్న విషయం సౌందర్య, ఆనందరావులకు తెలిసిపోతుంది. దీంతో.. శౌర్యను వెతకడానికి సౌందర్య బయలుదేరుతుంది.

కమింగ్ ఎపిసోడ్ లో... దీప పరుగులు పెడుతూ ఇంటికి చేరుకునే సరికి.. శౌర్య గుమ్మం దగ్గర స్పృహ కోల్పోయి కనపడుతంది. అక్కడికి సౌందర్య కూడా వెళ్తుంది. తలస్నానం చేసిన శౌర్యకి... తల తుడుస్తానంటూ సౌందర్య పిలుస్తుంది. దానికి శౌర్య... మీకు ఎందుకు లేండి.. మీరు మీ ఇంటికి వెళ్లండి.. మీకోసం అందరూ ఎదురు చూస్తుూ ఉంటారు. మాకు ఎవరూ లేరు కదా.. మేము ఇద్దరమే కాదా.. మా నాన్న రాడు.. మా నానమ్మ కూడా రాదు అంటూ మాట్లాడుతుంది..