'కార్తిక దీపం' సీరియల్ తో బుల్లితెరపై అడుగుపెట్టిన నటి ప్రేమివిశ్వనాధ్ అతి తక్కువ సమయంలో బాగా పాపులర్ అయింది. ఈ సీరియల్ లో దీపగా, వంటలక్కగా ఆమె నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో బుల్లితెర ప్రేక్షకులు ఆమెకి ఫ్యాన్స్ అయిపోయారు. ప్రస్తుతం ఈ సీరియల్ కూడా టీఆర్పీ రేటింగ్స్ లో దూసుకుపోతుంది. ఇప్పుడు వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్ కి సినిమాల్లో ఛాన్స్ వచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ షూటింగ్ లొకేషన్ లో ఫోటోలను షేర్ చేసింది ప్రేమి విశ్వనాధ్.

కన్నడలో కారుతుముత్తు సీరియల్ తో ఎంట్రీ ఇచ్చిన ప్రేమి విశ్వనాథ్.. పలు గేమ్ షోలకు హోస్ట్ గా కూడా వ్యవహరించారు. ఓపక్క సీరియల్స్ లో సత్తా చాటుతూనే.. సినిమాల్లో కూడా సత్తా చాటేందుకు రెడీ అయింది ప్రేమి విశ్వనాధ్. తాజాగా ఆమె మలయాళంలో 'సాల్మన్' అనే సినిమాలో నటిస్తుంది.

తాజాగా ఈ సినిమాలో నటించిన నటుడు రాజివెట్టన్ తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది ప్రేమి విశ్వనాథ్. అంతకుముంది ఈ సినిమాలో నటించిన నటులతో కలిసి దిగిన లొకేషన్ స్టిల్స్ ని ప్రేక్షకులను షేర్ చేసుకుంది. అయితే బుల్లితెర నుండి వెండితెరకి ప్రమోట్ అవుతున్న వంటలక్కకి అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఆమె అభిమానులు.