బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సీరియల్స్ లో కార్తీక దీపం ఒకటి. ప్రేక్షకుల నీరాజనాలను అందుకుంటూ.. అత్యధిక టీఆర్పీతో ముందుకు దూసుకుపోతోంది. ఈ సీరియల్ నేటి ఎపిసోడ్ మీకోసం ముందుగానే....

నేటి ఎపిసోడ్ లో.... శ్రావ్య తల్లి, దీప పినతల్లి భాగ్యం కూర్చొని లెక్కలు వేస్తూ ఉంటుంది. శ్రావ్య వచ్చి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. దీప విడాకులు తీసుకుంటే... రూ5కోట్ల భరణం వస్తుందని.. వాటిని ఏం చేయాలా అని లెక్కపెడుతున్నా అని చెబుతుంది. కోర్టు గడువు ముగియడానికి వస్తోందని.. కార్తీక్ కచ్చితంగా దీపకు విడాకులు ఇస్తాడని జోస్యంచెబుతుంది. అప్పుడు రూ.5కోట్లు భరణం వస్తుందని.. ఒక కోటితో స్థలం కొని, మరో కోటితో ఇళ్లు కొని.. మిగిలిన వాటితో క్యాటరింగ్ చేస్తే లాభాలే లాభాలు వస్తాయనిచెబుతుంది.

అది విన్న శ్రావ్య.. భాగ్యం చేతిలో ఫోన్ పెట్టి ఇదే విషయం మా అత్తగారికి చెప్పు అంటుంది. వెంటనే అదిరిపడిన భాగ్యం.. అమ్మో.. మీ అత్తకు తెలిస్తే నన్ను చంపేస్తుందని అంటుంది. తర్వాత సౌందర్య.. దీప విషయంలో ఏం ఆలోచిస్తుందో అంటూ ఇద్దరూ కాసేపు చర్చించుకుంటారు.

నెక్ట్స్ సీన్ లో... దీప గుమ్మం దగ్గర నిల్చొని శౌర్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది. బయటకు వెళ్లిన శౌర్య ఇంకా ఇంటికి ఎందుకు రాలేదని... తండ్రి కోసం వెతుకుతుందేమో అనుకుంటుంది. ఇదేమో తండ్రి కోసం... హిమ తల్లి కోసం ఆరాటపడుతున్నారని.. ఈ ఇద్దరి ఆశలు నెరవేరని తెలిస్తే ఏమైపోతారో అని భయపడుతుంది. 

అప్పుడే శౌర్య... వారణాసి ఆటోలో ఇంటికి వస్తుంది. ఏంటమ్మ అలా ఉన్నావు..? నాన్న కోసం వెతకడానికి వెళ్లాను అనుకున్నావా..? కాదు.. పుస్తకాలు కొనుక్కోవడానికే వెళ్లాను అని చెబుతుంది. ఇక నుంచి నాన్నను వెతకను లే అని చెబుతుంది. దీంతో దీప కంగారు పడుతుంది. ఏంటమ్మా... నాన్నను వెతుకుతాను అన్నా కంగారుపడతావు.. వెతకను అని చెప్పినా కూడా కంగారుపడతావు అని ప్రశ్నిస్తుంది.

తర్వత దీప ఎదురుగా కూర్చొని.. కొత్త నోట్ బుక్ లో శౌర్య.. డాటర్ ఆఫ్ కార్తీక్ అని రాస్తుంది. వెంటనే దీప కంగారుపడుతుంది. నువ్వే చెప్పావు కదమ్మా.. నాన్న పేరు కార్తీక్ అని అంటుంది. ఆ తర్వాత వారణాసిని ఉద్దేశించి..రేపు త్వరగా రా.. డాక్టర్ బాబు దగ్గరకు వెళ్లాలి అని చెబుతుంది. ఈ విషయంలో.. దీప, శౌర్యల మధ్య కాసేపు మాటల యుద్ధం జరుగుతుంది.

ఇదిలా ఉంటే... డాక్టర్ బాబుతో... వంటలక్క పెళ్లి ఎలా చేయాలా అని హిమ ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్లిద్దరికి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటుంది. వెంనటే నానమ్మ, తాతయ్యల దగ్గరుకు వెళ్లి వాళ్లిద్దరూ ఎలా ఉండేవారో అడిగి తెలుసుకుంటుంది. అలానే దీప, కార్తీక్ లు కూడా ఉన్నట్లు ఊహించుకుంటుంది. వెంటనే తండ్రిని స్కూటీ కొనాలని అనుకుంటుంది.,

కార్తీక్ రాగానే... డాడీ స్కూటీ కొనవా అని అడుగుతుంది. ఎవరికోసం అంటే నీకోసమే డాడీ అని  చెబుతుంది. నాకు ఎందుకమ్మా... అంటే ప్లీజ్ డాడీ అని బతిమిలాడుతుంది. దీంతో... ఒక్కసారి కోపం తెచ్చుకున్న కార్తీక్... మళ్లీ వెంటనే.. నీకోసం ఏదైనా చేస్తాను స్కూటీనేగా కొంటాను అని చెబుతాడు.

నెక్ట్స్ సీన్ లో.. దీప కూర్చొని ఉంటుంది. వెంటనే సరోజక్క వచ్చి శౌర్య వెళ్లిందా అని అడుగుతుంది. నీకెలా తెలుసు అంటే... వారణాసితో కలిసి ఆటోలో వచ్చి... లక్ష్మణ్ ని తీసుకొని వెళ్లిందట మా చెల్లి అరుణ చెప్పింది అంటుంది. ఎందుకు వెళ్లిందా అని వాళ్లిద్దరూ ఆలోచిస్తూ ఉంటారు.

రేపటి ఎపిసోడ్ లో.... శౌర్య డాక్టర్ బాబుని నిలదీస్తూ ఉంటుంది. ఓ షర్ట్ తీసుకువచ్చి... మా నాన్న కి ఈ షర్ట్ సరిపోతుందని మీరు చెప్పారు కదా డాక్టర్ బాబు గుర్తుందా అని అడుగుతుంది. నాకు మా నాన్న కావాలని నేను అడగనని.. కానీ ఆ షర్ట్ తీసుకువెళ్లి.. మా నాన్నకి మీ కూతురు ఇచ్చిందని చెప్పండి అంటూ వెళ్లిపోతుంది.