బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ... ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటున్న ధారావాహిక కార్తీక దీపం. టీఆర్పీల్లో అన్ని సీరియళ్లను , ప్రోగ్రామ్స్ ని తలదన్నే విధంగా ముందుకు దూసుకుపోతోంది ఈ సీరియల్. ఈ సీరియల్ ఈరోజు రాత్రి ఎపిసోడ్ మీకోసం ముందుగానే...

నేటి ఎపిసోడ్ లో... మా డాడీని పెళ్లిచేసుకో వంటలక్క అని హిమ... దీపని అడుగుతుంది. దానికి ఏం చెప్పాలో తెలియక.. దీప షాకౌతుంది. మౌనంగా ఉండిపోయిన దీపను చూసి హిమ... ఆలోచించుకొని నిర్ణయం చెప్పమని చెబుతుంది. వాళ్ల డాడిని మాత్రం తాను ఒప్పిస్తానని హామీ ఇస్తుంది.  ఏం సమాధానం చెప్పాలో తెలియని దీప.. ఏమీ మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

సీన్ కట్ చేస్తే... కోర్టు గడువు ముగిసేలోపు దీపను వదిలించుకుంటాను అని కార్తీక్ చెప్పిన మాటలకు మోనిత ఆనందంతో ఊగిపోతూ ఉంటుంది. ఈ విషయాన్ని పంచుకోవాలని వెంటనే ఇంటికి వెళ్తుంది. తన వంట మనిషి ప్రియమణిని పిలుస్తుంది. ఆమె వెంటనే మోనిత ఆనందాన్ని గమనించి..  హారతి ఇచ్చి ఇంట్లోకి రమ్మని చెబుతుంది.

హారతి ఇచ్చే క్రమంలో దీపం ఆరిపోతుంది. దీంతో మోనిత కొంచెం కంగారుపడుతుంది.అయితే... దానికి ప్రియమణి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆరిపోయిన దీపం దీప అని... ఆమె జీవితం ఇక ఆరోపోయిందని అర్థమని చెబుతుంది. దీంతో మోనిత ఆనందపడుతుంది. కార్తీక్.. దీపను వదిలించుకోవాలని చూస్తున్నాడని చెప్పి.. పండగ చేసుకుంటుంది.

మరోవైపు... దీప... తన అత్తమామలైన  సౌందర్య, ఆనందరావులను కలుస్తుంది. కార్తీక్ ని పెళ్లిచేసుకోమని హిమ తనను అడిగిన విషయాన్ని వాళ్లకు చెబుతుంది. వాళ్లు అది విని ఆనందపడగా.. దీప మాత్రం బాధపడుతుంది. తన భర్త మనసులో ఉన్న అనుమానం అనే దెయ్యం వదలనంత వరకు తన జీవితం ఇలానే ఉంటుంది అని బాధపడుంది. దీంతో.. దీపకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తారు సౌందర్య, ఆనందరావులు. దీప మాత్రం పరధ్యానంలో పడిపోయి పిచ్చిదానిలా నవ్వుతూ నడుచుకుంటూ వెళ్లిపోతుంది.

అక్కడ సీన్ కట్ చేస్తే... హిమ పుస్తకంలో ఏదో బొమ్మలు వేసుకుంటూ కనపడుతుంది. నానమ్మ, తాతయ్యలను చూసి కంగారుగా దాచిపెడుతుంది. హిమ మనసులో మాట ముందే తెలుసుకున్న సౌందర్య... ఎట్టిపరిస్థితుల్లోనూ వెనకడుగు వేయకూడదని అనుకుంటుంది. ఈ నేపథ్యంలో... హిమను మోటివేట్ చేసే పనిలో పడుతుంది. అధములు, మధ్యములు, ఉత్తములు అంటూ కథ  చెబుతుంది. అది విన్న హిమ...వంటలక్కతో డాడీ పెళ్లి చేసేవరకు తాను వెనకడుగు వేయకూడదని నిర్ణయం తీసుకుంటుంది. హిమలో ఆ ధైర్యాన్ని నింపినందుకు సౌందర్య ఆనందపడుతుంది.

ఆ తర్వా త హిమ గుగ్గిళ్లు తినడానికి కిచెన్ లోకి వెళ్లగానే... హిమ వేసిన డ్రాయింగ్ ని సౌందర్య, ఆనందరావులు చూస్తారు. అందులో వంటలక్క,నాన్న, సౌర్య, నేను అంటూ బొమ్మలు గీసి కనపడుతుంది. అది చూసి వాళ్లు ఆనందంగా ఫీలౌతారు.

రేపటి ఎపిసోడ్ లో... శౌర్య కొత్త పుస్తకాలు కొనుక్కోని దాంట్లో తన పేరు రాసుకుంటూ ఉంటుంది. తన పేరు శౌర్య.. డాటర్ ఆఫ్ కార్తీక్ అని రాస్తుంది. అది విని దీప కంగారు పడుతుంది అది గమనించిన శౌర్య వెంటనే... ఆటో డ్రైవర్ ని ఉద్దేశించి పదరా...డాక్టర్ బాబు ఇంటికి పోదాం అని అంటుంది. దీప కంగారుగా లేచి నిలపడుతుంది. నిజం తెలిసిన శౌర్య, తెలియకుండానే హిమ... కార్తీక్, దీపలను కలిపేందుకు చేసే ప్రయత్నాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.