బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న సీరియల్ కార్తీక దీపం. ఓ చిన్న అనుమానంతో విడిపోయిన దీప, కార్తీక్ లు మళ్లీ ఎలా కలుస్తారనే విషయం సీరియల్ లో ఆసక్తిగా మారింది. దీనికి తోడు వారి పిల్లలు శౌర్య, హిమలు కూడా వారిని కలపడానికి నిర్ణయం తీసుకున్నారు.  కాగా... నేడు టీవీలో ప్రసారం కావడానికి ముందే నేటి సీరియల్ ఎపిసోడ్ మీకోసం ముందుగా...

నేటి ఎపిసోడ్ లో... శౌర్య, హిమలు స్కూల్లో  ఎదురౌతారు. ఒకరికి మరొకరు చాక్లెట్స్ ఇచ్చుకుంటారు. ఆ సమయంలో హిమ.. శౌర్య మనద్దిరం స్నేహితులం కదా అంటుంది. దానికి శౌర్య... మనం ఫ్రెండ్స్ కాదు... నువ్వు నాకు సొంత చెల్లెలు లాంటి దానివి అని చెబుతుంది. కాగా.. శౌర్య మాటలకు హిమ, సౌందర్యలు షాకవుతారు. తేరుకున్న హిమ వెంటనే... ఇదే మాట ఇంతకముందే నాన్నమ్మ కూడా చెప్పిందంటూ చెబుతుంది. దీంతో సౌందర్యకు నోటి నుంచి మాట రాదు. ఆ సమయంలో శౌర్య.. సౌందర్యను ఓ కంట చూస్తూనే ఉంటుంది.

వెంటనే శౌర్య... ఓ.. అవునా.. మీకు కూడా అలానే అనిపించిందా అని సౌందర్యతో అంటుంది. దానికి ఆమె ఏమని అంటే.. ‘ అదే మీమిద్దరం అక్కా చెల్లెళ్లమని అనిపించిందా’ అంటూ వెటకారంగా అడుగుతుంది. దానికి సౌందర్య ఏం సమాధానం చెప్పాలో అర్థంకాక కాస్త ఇబ్బంది పడుతుంది.

వెంటనే శౌర్య మనసులో... అందరికీ అన్నీ తెలుసు.. కానీ బయటకు చెప్పరు.. నానమ్మకు మాత్రం ఇంకా ఎక్కువ తెలుసు అనుకుంటుంది.  ఆ తర్వాత.. హిమ.. సౌందర్యకు బై నానమ్మ అని చెబుతుంది. శౌర్య మాత్రం బై అని మాత్రమే చెబుతుంది. దీంతో నానమ్మ అని ఎందుకు పిలవలేదని మనసులోనే ఆలోచించుకుంటూ ఉండిపోతుంది సౌందర్య.ఆ వెంటనే వీళ్లిద్దరూ నిజంగా అక్కాచెళ్లెల్లు అన్న విషయం వాళ్లకు ఎప్పుడు తెలుస్తుందో అనుకుంటుంది.

సీన్ కట్ చేస్తే... దీప.. స్కూల్ కి వెళ్లడానికి బాక్సులు సర్దుతూ ఉంటుంది. అలా సర్దుతూనే... శౌర్యకు నిజం తెలిసిపోయిందా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే సౌందర్య... దీప దగ్గరకు వస్తుంది. ఈ రోజు స్కూల్ కి క్యారేజీలు తీసుకువెళతావా అని దీపని సౌందర్య అడుగుతుంది. వెంటనే ఆలోచనల నుంచి బయటకు వచ్చిన దీప.. మీరెప్పుడు వచ్చారు అని అడుగుతుంది.

శౌర్య గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతుంది.  అవును అంటూ సమాధానం చెప్పిన దీప.... కాసేపు శౌర్య గురించి మాట్లాడుకుంటారు.  శౌర్యకు నిజం తెలిసిందా లేదా అనే అనుమానంగా ఉందని దీప చెబుతుంది. శౌర్య ప్రవర్తన అంతా మారిపోయిందని చెబుతుంది. 

స్కూల్లో తనతో కూడా శౌర్య కోపంగా ఉందని... హిమతో కలిసిపోయిందని చెబుతుంది. ఇద్దరూ కలిసి కాసేపు శౌర్య, హిమల వింత ప్రవర్తన గురించి చర్చించుకుంటారు. 

మరో వైపు హాస్పిటల్ లో కార్తీక్ ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే అక్కడికి మోనిత వస్తుంది. వెంటనే కార్తీక్... మోనితకు థ్యాంక్స్ చెబుతాడు. తనకు తన విషయంలో క్లారిటీ వచ్చిందని  చెబుతాడు. తాను మంచివాడినేని.. కాకపోతే అతి మంచివాడిని కాదని... అమాయకుడిని కాదని చెబుతాడు. తనకు మంచి-చెడు తెలుసు అని... సంస్కారం ఏంటో తనకు తెలుసు అని చెబుతాడు.

దీపను తాను ఇష్టపడే పెళ్లి చేసుకున్నానని.. తప్పు చేసిందని వదిలేశానని చెబుతాడు. అలా అని దీప కనిపించిన ప్రతిసారి... ఆమె గుండె పగిలేలా తాను మాట్లాడలేనని చెబుతాడు. అలా అని అది తన బలహీనత, మంచితనం కాదని.. వద్దు అనుకున్నప్పుడు వద్దు అంతే అని చెబుతాడు. 

గతంలో శౌర్య పుట్టుకుపై మోనిత చేసిన కామెంట్స్ కి కార్తీక్ మండిపడతాడు. శౌర్య తన పుట్టుకను కావాలని తెచ్చుకోలేదని మోనితకు వివరిస్తాడు. తనకు నచ్చని వ్యక్తి కడుపులో పుట్టినంత మాత్రాన ఆ పసిదాని మనసు నొచ్చుకునేలా ఎందుకు మాట్లాడాలి అని మోనితను ప్రశ్నిస్తాడు. చాలా మందిని చదివిస్తున్నట్లే శౌర్యను కూడా చదివిస్తున్నట్లు చెప్పాడు. 

తనకు తన తల్లి, కుటుంబం అంటే ఇష్టమని.. ఇంకోసారి వాళ్ల గురించి చెడుగా తన వద్ద మాట్లాడవద్దని మోనితను సున్నితంగా హెచ్చరిస్తాడు.  గతంలో.. కార్తీక్ విడాకుల కోసం కోర్టుకు వెళతాడు.. అయితే.... కోర్టు మాత్రం 6నెలలు కలిసి ఉండాలని చెబుతుంది. ఈ విషయాన్ని గత ఎపిసోడ్ లో మోనిత.. కార్తీక్ కి గుర్తు చేస్తుంది.

ఆ విషయంలో తానొక నిర్ణయం తీసుకున్నాను అని... కోర్టు గడువు ముగిసే సమయానికి దీపను తాను పూర్తిగా దూరం చేసుకుంటాను అని మోనితకు చెబుతాడు. దీంతో మోనిత సంతోషపడుతుంది. అవసరమైతే.. దీప తప్పు చేసిందనే విషయాన్ని బయటపెట్టైనా.. దీపను తన నుంచి దూరం చేసుకుంటానని చెబుతాడు.

మరో వైపు హిమ... దీప కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. దీప రావడం చూసి వెంటనే వంటలక్క అంటూ పరుగులు తీస్తుంది. తర్వాత కాసేపు నీతో మాట్లాడాలి అంటూ పిలుస్తుంది. చిన్నగా... దీపను పక్కకు తీసుకువెళ్లి.. తన తండ్రి గురించి మాట్లాడటం మొదలుపెడుతుంది. తన తండ్రి చాలా మంచివాడని... కానీ.. ఎవరూ తనను సరిగా  చూసుకోవడం లేదని చెబుతుంది.

ఇవన్నీ నాకు ఎందుకు చెబుతున్నావు అని అడుగుతుంది దీప... దీంతో హిమ... మా నాన్నని నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది.  వెంటనే దీప షాకౌతుంది. కార్తీక దీపం సీరియల్ కొనసాగుతుంది.