Asianet News TeluguAsianet News Telugu

Karthika Deepam update: మోనితకన్నా వంటలక్క చాలా మంచిది డాడీ... కార్తీక్ మనసు మార్చేపనిలో హిమ


నేటి ఎపిసోడ్ లో.... కార్తీక్ హాస్పిటల్ కి వెళ్లడానికి రెడీ అయి కిందకు వస్తాడు. సరిగ్గా అప్పుడే.. సౌందర్య, ఆనందరావులు మార్నింగ్ వాకింగ్ కి వెళ్లి వస్తుంటారు. వెంటనే కార్తీక్ కి గుడ్ మార్నింగ్ చెబుతారు. దానికి కార్తీక్ కాస్త వెటకారంగా మాట్లాడతాడు. కాసేపు ఒకరిని మరొకరు ఇండైరెక్ట్ గా వాదించుకుంటారు. సరిగ్గా అప్పుడే హిమ కిందకు వస్తుంది.

karthika deepam serial 28th november written update
Author
Hyderabad, First Published Nov 28, 2019, 9:05 AM IST

బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేస్తున్న సీరియల్ కార్తీక దీపం.. రంగు తక్కువగా పుట్టి... సవతి తల్లి చేతిలో నానా తిప్పలు పడి... చివరకు ఓ మంచి మనిషిని పెళ్లి చేసుకొని గొప్ప ఇంటికి అడుగుపడుతుంది. రంగు తక్కువగా ఉన్నా... ఆమె గుణం గొప్పది కావడంతో.. అత్తింటివారు ఆమె మనసును అర్థం చేసుకుంటారు. ఇక దీపకు అన్నీ మంచి రోజులే అనుకునే సమయానికి ప్రేమించి పెళ్లాడిన భర్తలో అనుమానం మొదలౌతుంది. దీంతో ఆమె భర్త నుంచి దూరమౌతుంది. అప్పటి నుంచి నానా కష్టాలుపడుతూ దీప తన కూతురిని పెంచుతుంది. ఆ కూతురికి ఇప్పుడు తన కుటుంబం, నాన్న ఎవరో తెలియడంతో కథ మరింత ఆసక్తిగా మారింది. ఈ రోజు రాత్రి ఎపిసోడ్ మీ కోసం ముందుగానే...

నిన్నటి ఎపిసోడ్ లో.... దీప గురించి సౌందర్య, కార్తీక్ తో మాట్లాడుతుంది. కార్తీక్ నోరు జారడంతో సౌందర్య చెంప పగలకొడుతుంది. అది చూసిన హిమ.. తన తండ్రికి వంటలక్కతో పెళ్లి చేయాలని డిసైడ్ అవుతుంది. మరోవైపు సరోజక్క మరిదికి గుండె నొప్పి రావడంతో.. శౌర్య బలవంతం మీద కార్తీక్ హాస్పిటల్ కి తీసుకువస్తారు.

నేటి ఎపిసోడ్ లో.... కార్తీక్ హాస్పిటల్ కి వెళ్లడానికి రెడీ అయి కిందకు వస్తాడు. సరిగ్గా అప్పుడే.. సౌందర్య, ఆనందరావులు మార్నింగ్ వాకింగ్ కి వెళ్లి వస్తుంటారు. వెంటనే కార్తీక్ కి గుడ్ మార్నింగ్ చెబుతారు. దానికి కార్తీక్ కాస్త వెటకారంగా మాట్లాడతాడు. కాసేపు ఒకరిని మరొకరు ఇండైరెక్ట్ గా వాదించుకుంటారు. సరిగ్గా అప్పుడే హిమ కిందకు వస్తుంది.
అదేంటి డాడీ అప్పుడే హాస్పిటల్ కి బయలుదేరారు అని అడుగుతుంది. హాస్పిటల్ లో పని ఉందని చెబుతాడు. మధ్యాహ్నం నీకు బాక్స్ తెస్తాను అని చెబుతాడు. దానికి హిమ... వద్దు డాడీ.. నేను వంటలక్క దగ్గర తింటాను అని చెబుతుంది. ప్రతిసారీ అలా పరాయి వాళ్ల దగ్గర తింటే ఏం బాగుంటుంది చెప్పు అని కార్తీక్ నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాడు.

దానికి హిమ... వంటలక్క.. మోనితలా కాదు డాడీ.. చాలా మంచిది. మోనిత కన్నా కూడా చాలా మంచిది. మోనిత ప్రియమణితో వంట చేయించి తీసుకువస్తుంది. వంటలక్క అలా కాదని చెబుతుంది. వంటలక్క గురించి హిమ గొప్పగా చెప్పడం కార్తీక్ కి నచ్చదు.

హాస్పిటల్ లో కూర్చొని హిమ మాటల గురించే ఆలోచిస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే శౌర్య, దీప అక్కడికి వస్తారు. నాన్న అని పిలవబోయి శౌర్య..మళ్లీ ఆగి డాక్టర్ బాబు అంటుంది. కార్తీక్ తల పైకి ఎత్తి చూడగానే... సరోజక్క ఏడుచుకుంటూ డాక్టర్ బాబు అని వస్తుంది. ఏమైంది అంటే.. తన మరిదికి గుండె నొప్పి వచ్చిందని.. శౌర్య ఇక్కడికి తీసుకువచ్చిందని చెబుతుంది.

సీన్ కట్ చేస్తే.. మౌనిత అద్దం ముందు కూర్చొని రెడీ అవుతూ ఉంటుంది. ఆమెకు వంట మనిషి ప్రియమణి భోజనం తినిపిస్తూ ఉంటుంది. అలా భోజనం తినిపిస్తూ ప్రియమణి విసుక్కుంటుంది. మీకు సరైన టైమ్ కి పెళ్లి జరిగి ఉంటే ఆరేళ్ల కొడుకు ఉండేవాడని .. వాడికి మీరే భోజనం తినిపించేవారు అని చెబుతుంది. దానికి మోనిత.. నేను అలాంటి మిడిల్ క్లాస్ కోరికలు కోరుకోను అంటూ.. కార్తీక్ తనకు అన్నం తినిపించినట్లు ఊహించుకుంటుంది. ప్రియమణి పిలుపుతో వాస్తవంలోకి వచ్చి... కార్తీక్ దగ్గరకు వెళ్తాను అంటుంది.

దానికి ప్రియమణి ఓ సలహా ఇస్తుంది. ఆమె సలహా ప్రకారం... మోనిత... శ్రావ్య దగ్గరకు వెళ్తుంది. అక్కడ శ్రావ్య ఆరోగ్యం గురించి ఆరా తీస్తూనే.. కార్తీక్ తనతో క్లోజ్ గా ఉంటున్నాడని నమ్మించే ప్రయత్నం చేస్తుంది. మోనిత మాటలకు శ్రావ్య కూడా కాస్త కటువుగానే స్పందిస్తుంది. వెటకారంగా మాట్లాడుతుంది. తర్వాత మోనిత.. సౌందర్య ని విమర్శిస్తూ మాట్లాడుతుంది. ఎప్పటికైనా తాను కార్తీక్ ని పెళ్లి చేసుకొని తీరాతాననే అర్థం వచ్చేలా మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

ఇదిలా ఉండగా.. సరోజక్క మరిదిని  కార్తీక్  పరిశీలించి ఐసీయూలోకి పంపిస్తాడు. వెంటనే దీపను.. నీతో మాట్లాడాలని పిలుస్తాడు. వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారా అని శౌర్య చాటుగా వింటూ ఉంటుంది.  అక్కడ కార్తీక్... దీప మీద సీరియస్ అవుతాడు. నేను తండ్రి అని శౌర్యకి చెప్పావా అని ప్రశ్నిస్తాడు. దానికి దీప నేనేమీ చెప్పలేదు అని చెబుతుంది.

నేను ఎంత దూరంగా ఉండమని చెప్పినా.. దగ్గర కావాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు.. నీతోపాటు నీ కూతురిని కూడా నాకు దగ్గర చేయాలని చూస్తున్నావు అని కార్తీక్ మండిపడతాడు. శౌర్యకి తండ్రి కవాలని నువ్వే ఆశలు రేపావు అంటూ దీపను నానా మాటలు అంటాడు. సరిగ్గా అప్పుడే ఓ నర్సు.. శౌర్యను ఇక్కడ ఉండకూడదని పక్కకు పంపిస్తుంది.

శౌర్య ఇలా వెళ్లగానే. దీప.. నేను ఇప్పటి వరకు ఏ అబద్ధం చెప్పలేదు డాక్టర్ బాబు అంటుంది. నువ్వు అబ్ధం చెప్పలేదు.. నేను అబ్బద్ధం చెప్పలేదు.. మరి శౌర్య ఎక్కడి నుంచి వచ్చింది అని కార్తీక్ ప్రశ్నిస్తాడు. దానికి దీప సమాధానం లేకుండా నిలపడుతుంది..


 

Follow Us:
Download App:
  • android
  • ios