కార్తీక దీపం అంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండదు. డైలీ సీరియల్ చూడకపోయినా ఆ సీరియల్ సృష్టిస్తున్న రికార్డులే మంచి గుర్తింపు తెస్తున్నాయి. ఇక వాటిపై వచ్చే మీమ్స్ కూడా నేటితరం యువ తరానికి సీరియల్ దగ్గరవుతోంది. ఫైనల్ గా కార్తీకదీపం ఎదో ఒక విధంగా అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది. ఇక అందులో ఉండే పాత్రలకు సైతం భారీ సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు.

మెయిన్ గా వంటలక్క రేంజ్ రోజురోజుకి మరీంత పెరుగుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకుపోతోంది. అసలు మ్యాటర్ లోకి వస్తే.. సీరియల్ లో కీలక పాత్ర పోషిస్తున్న వంటలక్క కారు కొనేసింది. దీప అనే పాత్రలో నటిస్తున్న వంటలక్క అసలు పేరు ప్రేమి విశ్వనాధ్. ఎమోషనల్ గానే కాకుండా డిఫరెంట్ హావభావాలతో ఎంటర్టైన్ చేయగల వంటలక్క బ్రాండ్ ఇప్పుడు మాములుగా లేదు.

ఇక ఇటీవల ఆమె 60 లక్షల ఖరీదైన బెంజ్ suv కారును కొనుగోలు చేసింది. KL 43L 3444 నెంబర్ తో ఉన్న తన కారు ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. చాలా మంది సినీ హీరోలు ఇప్పుడు ఎక్కువగా ఇదే కారును వాడుతున్నారు. ఇక ఇప్పుడు వారి లిస్ట్ లో వంటలక్క కూడా చేరిపోయింది. అతి తక్కువ కాలంలోనే ఈ రేంజ్ కి ఎదిగిన ప్రేమి విశ్వనాధ్ ముందు ముందు ఇంకా ఏ స్థాయికి చేరుకుంటుందో చూడాలి.