ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా మహమ్మారి గుప్పిట్లో చిక్కి విలవిల లాడుతోంది. ఈ వైరస్‌ను కట్టడిచేయలేక ప్రపంచ దేశాలన్నీ తలలు పట్టుకున్నాయి. రోజు రోజు మరింత గా విజృభిస్తున్న ఈ మాయదారి రోగం, భారత్‌ కాస్త తక్కువగానే ఉన్న పరిస్థితులు మాత్రం భయాందోళను కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో ధైర్యం నిపేందుకు, పరిస్థితుల మీద ప్రజలకు అవగాహన కలిగించేందుకు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా వారిని ఉత్సాహ పరుస్తున్నారు. అడపాదడపా వారిని నవ్విస్తున్నారు కూడా.

తాజాగా ఓ బాలీవుడ్‌ యంగ్ హీరో అలాంటి ప్రయత్నమే చేశాడు. కరోనాపై ప్రజల్లో అవేర్నెస్‌ కలిగించేందుకు వరుస ట్వీట్లు చేస్తున్న హిందీ నటుడు కార్తీక్ ఆర్యన్, తాజాగా మరో ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఆదివారం ఉదయం ట్విటర్ వేదికగా తను కరోనాకు వ్యాక్సిన్‌ కనుగొన్నట్టుగా చెప్పాడు. అయితే అది తన కలలో అని కూడా క్లారిటీ ఇచ్చాడు కార్తీక్‌. అయితే ఈ కామెంట్ తో పాటు తనకు వేల సంఖ్యలు అభిమానులు స్వాగతం పలుకుతున్న ఓ వీడియోను షేర్ చేశాడు. ఈ పోస్ట్ పై అభిమానులు కూడా ఫన్నీగా స్పందిస్తున్నారు.

ఇక సినిమా విషయానికి వస్తే... దోస్తానా 2, భూల్ భూలైయా 2 లలో నటిస్తున్నాడు. లాక్ డౌన్‌ ముందు ఓ ప్రమాదం చేతికి గాయం కావటంతో కార్తిక్‌ షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చాడు. ఆ తరువాత లాక్‌ డౌన్‌ విధించటంతో ఆ రెండు సినిమాలు నిలిచిపోయాయి. పరిస్థితులు చక్కబడిన తరువాత ఆ సినిమాను తిరిగి లైన్‌ లో పెట్టే ప్లాన్‌లో ఉన్నాడు కార్తీక్‌.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Aaj Sapna Aaya ki Mujhe Vaccine Mil Gayi👨🏻‍🔬

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on Apr 5, 2020 at 1:48am PDT