పబ్లిసిటీ ఎంత హోరెత్తించినా సినిమాలో కంటెంట్ లేకపోతే కలెక్షన్స్ కు కటీఫ్ అని రీసెంట్ గా దీపావళి కానుకగా విడుదలైన విజిల్ ప్రూవ్ చేసింది. అలాగే అదే రోజు రిలీజైన ఖైదీ చిత్రంకు ఓపినింగ్స్ లేకపోయినా కేవలం సినిమా మౌత్ టాక్ తోనే అదరగొట్టేస్తోంది. కార్తీ ఖైదీ దెబ్బకి ఈ వారం రిలీజైన మిగతా సినిమాలు కూడా  విలవిల్లాడుతున్నాయి.

వాస్తవానికి కార్తీ మార్కెట్ దృష్టిలో పెట్టుకుని ఖైదీ సినిమాని చాలా తక్కువ మొత్తానికి డబ్బింగ్ హక్కులను తీసుకున్నారు. అది కూడా కలెక్షన్స్ రాకపోతే అంటూ కండిషన్స్ అప్లై అన్నారు. అయితే సినిమాలో హీరోయిన్ లేకపోవటం, ప్రమోషన్స్  పెద్దగా లేకపోవటంతో, నిర్మాత భయపడినట్లే మొదటి రోజు ఖైదీ ఓపెనింగ్స్ చాలా డల్ గా  ఉన్నాయి. సినిమా కమర్షియల్ గా  ప్లాఫ్ అనుకుంటున్న సమయంలో మిరాకిల్ జరిగింది. మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఖైదీ టాక్ ని బట్టి రెండో రోజు, మూడో రోజు కూడా ఖైదీ కలెక్షన్స్ కుమ్మేయటమే కాకుండా.. సోమ, మంగళ, బుధ వారాల్లోనూ ఖైదీ కలెక్షన్స్ ఓ రేంజ్ లో వచ్చి ట్రేడ్ వర్గాలకు షాక్ ఇచ్చింది.

 కార్తి చేసిన లాస్ట్ 3 సినిమాలు తెలుగులో ఫ్లాప్ అవటమే కాదు.. లేటెస్ట్ చిత్రం దేవ్ అయితే ఓ పెద్ద డిజాస్టర్. దాంతో ఖైదీ సినిమా హక్కుల్ని తక్కువ రేటుకు దక్కించుకోగలిగారు నిర్మాత రాధామోహన్. అలా తక్కువ రేటుకు దక్కించుకున్న రాధామోహన్, సినిమాను తక్కువ రేట్లకే అమ్మారు. దీంతో ఇప్పుడు అంతా కేవలం ఏడు రోజుల్లోనే బ్రేక్-ఈవెన్ అయిపోయారు. బయ్యర్లు సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం మార్కెట్లో పెద్ద సినిమా లేకపోవడంతో.. ఇంకో వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఖైదీ సినిమా ఆడుతుందని లెక్కలు వేస్తున్నారు.

మంచి సినిమాని ప్రేక్షకులు మిగతా మసాళాలు లేకపోయినా ఆదరిస్తారని చెప్పడానికి ఖైదీ చక్కని ఎగ్జాంపుల్.  ఖైదీ తమిళనాట  హిట్ టాక్ తో దూసుకుపోతోంది.  త్వరలోనే కార్తీ ఖైదీ 2 అంటున్నాడు కూడా.