కెరీర్ ప్రారంభంలో తమిళం కన్నా తెలుగులోనే మంచి మార్కెట్ సాధించిన కార్తి...తర్వాత రొటీన్ కథా చిత్రాలు చేసి వెనకబడిపోయారు. కార్తీ సినిమా అంటే వన్ పర్శంట్ కూడా క్రేజ్ లేని స్దాయికి చేరుకున్న టైమ్ లో  'ఖైదీ'లాంటి బ్లాక్ బస్టర్ పడింది. దాంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చేసాడు. విభిన్నమైన కథాంశాలు ఎప్పుడూ ఆదరిస్తామనే తెలుగువారు ఖైదీ సినిమాని నెత్తిన పెట్టుకున్నారు.

ఆ ఊపులో ఇప్పుడు మరో సినిమాని రిలీజ్ కు రెడీ చేసేసాడు.  యాంగ్రీ హీరో కార్తీ హీరోగా వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ ప్రొడక్షన్‌ పతాకాలపై దృశ్యం ఫేమ్‌ జీతు జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న‌ చిత్రం  ‘తంబి’. ఈ సినిమా తెలుగులో ‘దొంగ’ టైటిల్‌తో డిసెంబరు 20న విడుదల కాబోతోంది. జీతూ జోసెఫ్‌ దర్శకుడు. ఇందులో కార్తి తమ్ముడిగా, జ్యోతిక అక్కగా నటించారు.  

ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ ను హర్షిత మూవీస్ అధినేత రావూరి వి. శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు.  ఖైదీ హిట్ తో ఖచ్చితంగా ఈ సినిమాకు ఓ రేంజిలో క్రేజ్ రావాలి. అయితే చిత్రంగా దొంగ ని పట్టించుకున్నవాళ్ల లేకపోయారు. దాంతో మంచి రేటు పెట్టి తెలుగు రైట్స్ తీసుకున్న వాళ్లు కాస్త కంగారుపడుతున్నట్లు సమాచారం.    అప్పటికీ ట్రైలర్ ఇంట్రస్టింగ్ గానే ఉంది.

దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ డైరక్టర్ కావటంతో ఓ వర్గానికి ఈ సినిమాపై కొద్దిగా ఆసక్తి పుట్టింది.తెలుగులోనూ కార్తీ స్వయంగా వచ్చి ప్రమోట్ చేసారు.  అయితే రేపు రిలీజ్ కాబోతున్న స్టైయిట్ చిత్రాలు రూలర్, ప్రతీ రోజు పండగే సినిమాలకు వచ్చిన బజ్ ని ఈ సినిమా సాధించలేకపోయింది. తెలుగులో ప్రమోషన్ సరిపోకపోవటమే అందుకు కారణం అంటున్నారు. హిట్ టాక్ వచ్చాక సినిమా పబ్లిసిటీపై బాగా ఖర్చుపెడదామని తెలుగు రిలీజ్ చేస్తున్న నిర్మాత భావించాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

కార్తి మాట్లాడుతూ.. ‘‘దొంగ’ కథ వినేటప్పుడు అక్క- తమ్ముడు మధ్య బంధం చాలా ఎమోషనల్‌గా అనిపించింది. ‘ఊపిరి’లో లాగానే ఈ సినిమాలో కూడా అందమైన మొమెంట్స్ ఉన్నాయి. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాని ఎప్పుడూ ప్రోత్సహిస్తుంటారు. ‘దొంగ’ మీకు తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం నాకుంది. ‘నా పేరు శివ’, ‘ఊపిరి’ కలిసిన సినిమాలా ఇది ఉంటుంది. అందరి హృదయాల్ని తాకుతుంది. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. కుటుంబంతో కలిసి థియేటర్‌లో ‘దొంగ’ సినిమాను ఎంజాయ్‌ చేయండి’ అని అన్నారు.