కోలీవుడ్ యువ హీరో కార్తీ మరో బిగ్ మూవీకి ప్లాన్ రెడీ చేసుకుంటున్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న కార్తీ ఇటీవల రెండు నెలల గ్యాప్ లోనే రెండు సినిమాలతో హడావుడి చేశాడు. మొత్తంగా కార్తీ ఈ ఏడాది మూడు సినిమాలతో వచ్చాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేసిన దేవ్ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది.

ఖైదీ తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. ఇక వదినమ్మకు అక్కగా కనిపించి తంబీ అనే సినిమా చేసిన కార్తీ ఈ ఇయర్ ని ప్లాప్ తో ముగించాడు. ఇకపోతే నెక్స్ట్ ఈ స్టార్ హీరో తమ్ముడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ ని టచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా ఖైదీ లాంటి మరో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని పీఎస్.మిత్రన్ చెప్పిన ఒక ప్రయోగాత్మక కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.  

గత ఏడాది విశాల్ తో అభిమన్యుడు అనే సినిమా చేసిన యువ దర్శకుడు మిత్రన్ ఈ ఏడాది హీరో అనే సినిమాను డైరెక్ట్ చేశాడు. శివ కార్తికేయన్ కథానాయకుడిగా నటించిన ఈ తమిళ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ని అందుకుంది. ఇక రీసెంట్ గా మిత్రన్ కార్తీకి మరో కథను వినిపించాడట. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కనున్న ఆ సినిమాలో కార్తీ ద్విపాత్రాభినయంలో దర్శనమివ్వనున్నాడట.

అయితే మిత్రన్ కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ యువ హీరో అఖిల్ కి కథ చెప్పినట్లు టాక్ వచ్చింది. అఖిల్ తో కలిసి మిత్రన్ డిన్నర్ కూడా చేశాడు. కానీ ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా మిత్రన్ కార్తీ కాంబినేషన్ పై రూమర్స్ వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.