వరుసగా ప్లాప్ వస్తే కథానాయకులు ఎక్కువగా నెక్స్ట్ సినిమాను కమర్షియల్ గా ప్లాన్ చేసుకొని హిట్ కొట్టాలని అనుకుంటారు. విజయాలు అందకుంటే మళ్ళీ ప్రయోగం చేయడం పెద్ద రిస్క్ అని డిఫరెంట్ కథల జోలికి వెళ్లకుండా జాగ్రత్తపడతారు. కోలీవుడ్ హీరోల్లో ఈ డోస్ కాస్త ఎక్కువగానే ఉంటుంది.  అయితే యువ హీరో కార్తీ ఎన్ని ప్లాపులు ఎదురైనా ప్రయోగాలతోనే ముందుకు సాగుతానని అంటున్నాడు.

తమిళ్ తెలుగు అని తేడా లేకుండా గత కోనేళ్ళుగా ఒక రేంజ్ లో హిట్స్ అందుకునే కార్తీ ఇటీవల మాత్రం తెలుగులో అనుకున్నంతగా సక్సెస్ అందుకోవడం లేదు. దారుణంగా విఫలమవుతున్నాడు. ఖాకి సినిమాతో పర్వాలేదనిపించిన కార్తీ ఆ తరువాత చినబాబు - దేవ్ సినిమాతో డిజాస్టర్స్ అందుకున్నాడు. ఇప్పుడు ఖైదీ అనే మరొక డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు.  ఆ సినిమా ట్రైలర్ ని రీసెంట్ గా విడుదల చేసిన కార్తీ యాక్షన్ అండ్ థ్రిల్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటున్నాడు.

సినిమాలో సాంగ్స్ అండ్ రొమాన్స్ ఏ మాత్రం ఉండవట. ఒక జీవిత ఖైధీ జీవితం చుట్టూ సినిమా ఊహించని ట్విస్ట్ లతో తెరకెక్కినట్లు తెలుస్తోంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. కార్తీ సరికొత్త లుక్ అలాగే యాక్షన్ సీన్స్ కూడా సాలిడ్ గా ఉన్నాయి.  ఈ చిత్రం షూటింగ్ ని పూర్తిగా రాత్రుల్లోనే చిత్రీకరించారట. 62 రోజుల పాటు నిర్విరామంగా రాత్రుళ్ళు షూటింగ్ జరిపిన ఏకైక చిత్రం ఇదే అయ్యి ఉంటుందని చెబుతున్నారు.

జైలు నుంచి తప్పించుకున్న ఒక ఖైదీ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనేది సినిమా అసలు పాయింట్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ద్వారా కార్తీ తెలుగు ఆడియెన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి.