మంచి బాక్స్ ఆఫీస్ మార్కెట్ ఉన్న కోలీవుడ్ హీరోల్లో కార్తీ ఒకరు. కార్తీ ఎలాంటి సినిమా చేసినా మినిమమ్ వసూళ్లు అందుతాయని చెప్పవచ్చు అలాగే తెలుగులో కూడా ఈ హీరో మంచి మార్కెట్ ను సెట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక మొత్తానికి ఖైదీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఓ రికార్డు నమోదు చేసింది. పాటలు - హీరోయిన్ లేకుండా వచ్చిన ఈ డిఫరెంట్ మూవీ 100కోట్ల వసూళ్లను అందుకుంది.

మెగాస్టార్ కెరీర్ లో అప్పట్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రం ఖైదీ. ఇక ఇప్పుడు అదే టైటిల్ తో కార్తీ కూడా మంచి బూస్ట్ అందుకున్నాడు. కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. టాలీవుడ్ ఆడియెన్స్ అభిమానానికి ఫిదా అయ్యే కార్తీ తెలుగు నేర్చుకొని మరి సొంతంగా డబ్బింగ్ చెబుతున్నాడు. కార్తీ మొదటి సినిమా యుగానికి ఒక్కడు తమిళ్ లో కంటే తెలుగులోనే ఎక్కువరోజులు ఆడింది.

ఇక ఆవారా సినిమా కూడా టాలీవుడ్ లో మంచి విజయాన్ని అందుకోవడంతో అప్పటి నుంచి కార్తీ ప్రతి సినిమా తెలుగులో అనువాదమవుతోంది. ఇక ఊపిరితో డైరెక్ట్ తెలుగు సినిమా చేశాడు. కానీ కార్తీ తెలుగులో ఈ మధ్య అనుకున్నంతగా సక్సెస్ అవ్వలేదు. మొత్తానికి ఖైదీతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. చాలా రోజుల తరువాత కార్తీ తెలుగు రాష్ట్రలో సాలిడ్ బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నాడు.

ఖైదీ సినిమా 13కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్నట్లు తెలుస్తోంది.  ఇప్పటికే సినిమా బయ్యర్స్ ని సేఫ్ జోన్ లోకి తెచ్చింది. ఓ వైపు విజిల్ గట్టిపోటీని ఇచ్చినప్పటికీ కార్తీ సినిమా కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గలేదు. ఇక మొత్తానికి సినిమా లాభాలు అందించడంతో పాటు కార్తీ కెరీర్ లో ది బెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్ గా ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది. లోకేష్ కనగరాజన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోయిన్ - సాంగ్స్ లేకపోవడం విశేషం. ఓన్లీ యాక్షన్ అండ్ ఎమోషనల్ సీన్స్ తో దర్శకుడు చేసిన ప్రయోగం వర్కౌట్ అయ్యింది.