బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న సీరియల్ కార్తీక దీపం. ఈ రోజు నవంబర్ 25 రాత్రి ఎపిసోడ్ లో జరగనున్న ముందుగానే ఏషియానెట్ లో మీకోసం..

గత ఎపిసోడ్ లో.... గుడి నుంచి ఇంటికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది శౌర్య. ఎదురుగా కార్తీక్ కనపడతాడు. ముందు నాన్న అని పిలవాలని అనుకుంటుంది. కానీ అలా పిలిస్తే ఏం జరుగుతోందో ముందే ఊహించుకొని... తర్వాత డాక్టర్ బాబు అని పిలుస్తుంది. తన మనసులోని తండ్రి ఉన్న విషయాలన్నింటినీ ఇండైరెక్ట్ గా అడుగుతుంది. మరోవైపు దీప, సౌందర్యలు శౌర్య కోసం వెతుకుతూ ఉంటారు.

నేటి ఎపిసోడ్ లో... సౌందర్య.. శౌర్య కోసం వెతకడానికి బయలు దేరుతుంది. దీప కంగారు పరుగెత్తుకుంటూ ఇంటికి చేరుకుంటుంది. అప్పటికే ఇంటి గుమ్మం వద్ద శౌర్య పడిపోయి కనపడుతుంది. అప్పటికే సౌందర్య కూడా అక్కడికి చేరుకుంటుంది. ఇద్దరూ కలిసి శౌర్య దగ్గరకు వెళ్తారు. తిండి కూడా తినకుండా ఎక్కడికి వెళ్లావంటూ దీప.. శౌర్యను ప్రశ్నిస్తుంది. కాగా... నిజంగా తెలుసుకున్న శౌర్య.... సౌందర్య, దీపలను ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపిస్తుంది.

మేము మీకు ఏమీ కాము కదా... మా కోసం ఎందుకు ఏడుస్తున్నారంటూ సౌందర్యను ప్రశ్నిస్తుంది. ఆ తర్వాత... దీపను ప్రశ్నిస్తుంది.  నేను అంటే నాన్నను వెతకడానికి వెళ్లాను.. మరి నువ్వు ఎక్కడికి వెళ్లావు అమ్మ. నాన్నను వెతకడానికి వెళ్లావా..? ఏమన్నాడు? నాన్న రాను అన్నాడా..? నేను కూడా వద్దు అన్నాడా అని అడుగుతుంది. దానికి దీప ఏడుస్తూ... నేను మీ నాన్నను వెతకడానికి వెళ్లలేదు అని.. నువ్వు కూడా వెళ్లొద్దని చెబుతుంది. వెంటనే సౌర్య... ఇంట్లో కి వెళదాం అమ్మ..తలస్నానం చేస్తాను అని అడుగుతుంది. సౌందర్యను మేడం అని పిలుస్తూ.. లోపలికి రమ్మని కోరుతుంది. నానమ్మ అని కాకుండా మేడం అని పిలవడంతో సౌందర్య షాకౌతుంది.

మరో వైపు మోనిత తన ఇంటికి వెళ్తుంది. అక్కడ తన ఇంటి పనిమనిషి ప్రియమణితో మాట్లాడుతూంది. వంట అదరగొట్టావంటూ పొగిడేసి.. తర్వాత తనకు ఓ సలహా కావాలని ప్రియమణిని కోరుతుంది.  గత ఎపిసోడ్ లో.. దీప,కార్తీక్ లతో చేసిన మాటల యుద్ధం గురించి ప్రియమణికి చెబుతుంది.  నేను ఎమైనా ఎక్కువ మాట్లాడానా అని మోనిత అడుగుతుంది. దానికి ప్రియమణి... మీరు చేసిన దాంట్లో ఏ తప్పుూ లేదని ఓదారుస్తుంది. కార్తీక్ బాబు అంటే మీకు ప్రాణం కాబట్టి... అందుకే అలా మాట్లాడారని చెబుతుంది.

ఇంతలో సౌర్య వచ్చి సౌందర్య పక్కనే కూర్చోగా.. దీప వంటగదిలోకి వెళ్తుంది. ‘తల తుడుస్తాను రావే’ అన్న సౌందర్యతో.. వద్దండీ.. మీరు గొప్పవారు.. ఈ వంటలక్క కూతురు తల తుడవడం ఎందుకు? అంటూనే మాటలతో బాధపెడతుంది. దాంతో సౌందర్య బాధగా అక్కడ నుంచి వెళ్లిపోతుంది. అదంతా విన్నదీప.. అత్తమ్మా? ఏం చేస్తున్నావ్? ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? అంటూ సౌర్యని తిడుతుంటే.. సౌర్య మాత్రం కూల్‌గా.. నువ్వు ఆగమ్మా.. ఇప్పుడు ఎవరేం మాట్లాడినా తెలుసుకునేంత తెలివిపెరిగిపోయిందమ్మా నాకు అంటూ లోపలికి వెళ్లిపోతుంది. దాంతో దీప ఆలోచనలో పడుతుంది. 

రేపటి ఎపిసోడ్ లో.... సౌందర్య, కార్తీక్ తో మాట్లాడుతూ ఉంటుంది.  ఇంటికి దీప ఉసురు తగులుతందని ఆవేదన వ్యక్తం చేస్తుంది. దానికి కార్తీక్ మండిపోతాడు. దీప, దాని కూతురు  ఈ ఇంట్లో అడుగుపెట్టడానికి వీలు లేదని తేల్చి చెబుతాడు. దీంతో... వెంటనే సౌందర్య.. కార్తీక్ చెంప పగలగొడుతుంది. పరుగున అక్కడికి వచ్చిన హిమ... నానమ్మ సౌందర్య వైపు కోపంగా చూస్తూ ఉంటుంది.