బాలీవుడ్ లో కాలక్రమేణా రొమాంటిక్ సీన్ ల డోస్ ఇంతకింతకు పెరుగుతూ వస్తోంది. 90ల కాలం నుంచి లిప్ లాక్ సీన్స్ ఊహించని విధంగా ఆడియెన్స్ కి మంచి కిక్కిచ్చాయి. అయితే రీసెంట్ కరిష్మా కపూర్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో గోల్డెన్ డేస్ లోని ఒక రొమాంటిక్ సీన్ ని గుర్తు చేసుకున్నారు. 1996లో వచ్చిన రాజా హిందూస్థానీ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఆ సినిమాలో కరిష్మా కపూర్ - అమీర్ ఖాన్ హీరోహీరోయిన్స్ గా నటించారు. అయితే సినిమాలో  రెయిన్ సీన్ లో వచ్చే రొమాంటిక్ కిస్ సీన్ గురించి కరిష్మా మరొకసారి బయటపెట్టింది. అందరు ఆ కిస్ సీన్ చూసి ఒక గంటలో తీసేశారని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి ఆ సీన్ కోసం మూడు రోజులు కష్టపడాల్సి వచ్చింది.

చల్లగా ఉండే ఉటి లొకేషన్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ ముద్దు సీన్ కోసం పనిచేశాం. కొన్ని నిముషాలు మాత్రమే ఉండే ఆ సీన్ కోసం మూడు రోజుల పాటు శ్రమించాల్సి వచ్చింది. అమీర్ కి నాకు అదొక పనిష్మెంట్ లా అనిపించిందని' కరిష్మా వివరణ ఇచ్చింది. రాజా హిందూస్థానీ సినిమా అప్పట్లో బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ ఒకటిగా నిలిచింది. మొదటిసారి లిప్ లాక్ సీన్ తో అమీర్ - కరిష్మా సినిమా కలెక్షన్స్ కి మంచి బూస్ట్ ఇచ్చారు