కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా  పేద మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. ఉన్నత వర్గాల వారు మాత్రం ఈ లాక్‌ డౌన్‌ హాలీడేస్‌ ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎప్పుడూ షూటింగ్ లు ప్రయాణాలతో బిజీగా ఉండే సినీ తారలు ఈ లాక్ డౌన్‌ కాలాన్ని పూర్తిగా కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. అదే సమయంలో అభిమానులను అలరించేందుకు త్రో బ్యాక్‌ పిక్చర్స్‌ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. ఈ సమయంలో కొత్తగా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన తారలు మరింత యాక్టివ్‌గా అభిమానులతో ఇంటరాక్ట్ అవుతున్నారు.


ఈ లిస్ట్ బాలీవుడ్‌ హాట్ బ్యూటీ బెబో కరీనా కపూర్‌ కూడా ఉండటం విశేషం. ఈ భామ ఈ మధ్యే ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వరుసగా తన త్రో బ్యాక్‌ మెమరీస్‌ను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది బెబో.  తాజాగా ఓ హాట్ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో షేర్ చేసింది బెబో. గతంలో తను భర్త సైఫ్‌ అలీ ఖాన్ , కొడుకు తైమూర్‌ అలీ ఖాన్‌తో కలిసి వెళ్లిన ఓ వెకేషన్‌ ఫోటోను ఇన్‌స్టా పేజ్‌లో షేర్‌ చేసింది. 

అయితే ఈ ఫోటోలో రెడ్‌ హాట్ బికినీ ఉన్న కరీనాను చూసి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. ఇంటర్‌నెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి గ్లామరస్‌ ఫోటోలను ఎప్పుడూ షేర్ చేయకపోవటంతో అభిమానులు ఈ సెక్సీ ఫోటోతో పండగ చేసుకుంటున్నారు. ఈ ఫోటో తరువాత ముందు ముందు మరిన్ని గ్లామరస్‌ ఫోటోలు చూడొచ్చని ఆనందపడిపోతున్నారు.