లాక్ డౌన్‌ కారణం ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో వారు షేర్ చేస్తున్న కొన్ని పోస్ట్‌లు వివాదాస్పదమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరీనా కపూర్ కు సంబంధించిన ఓ మ్యాగజైన్‌ ఫోటో షూట్‌, ఇంటర్వ్యూ కూడా వివాదాస్పదంగా మారింది.

బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ బెబో కరీనా కపూర్‌ ఈ నెల వోగ్ మ్యాగజైన్ కవర్ పేజ్ మీద మెరిసింది. లాక్‌ డౌన్‌ కారణంగా కరీనా కపూర్‌ కూడా ఇంటి నుంచి ఈమ్యాగజైన్‌కు ఇంటర్య్వూ ఇచ్చింది. ఏప్రిల్‌కు సంబంధించిన ఈ ఇంటర్వ్యూ గురువారం పబ్లిష్‌ అయ్యింది. అయితే ఇప్పడు ఆ ఇంటర్య్యూను విమర్శలకు కారణమైంది. అయితే బెబో ఆ ఫోటో షూట్ నెల క్రితమే చేసింది. అప్పటికి దేశంలో కరోనా ప్రభావం ఇంతగా లేదు. లాక్ డౌన్‌ కూడా ప్రకటించలేదు.

ఆ ఫోటోలను ఏప్రిల్ ఎడిషన్ కవర్‌ పేజ్‌ మీద పబ్లిష్ చేశారు. అంతేకాదు కరీనా ఫోటో షూట్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో  కూడా రిలీజ్ చేశారు. పరిస్థితులు ఇలా ఉన్న సమయంలో హాట్ ఫోటోలను షేర్‌ చేయటంపై నెటిజెన్లు విమర్శిస్లున్నారు. మ్యాగజైన్‌ ఇంటర్వ్యూలో భాగంగా ఒక వేళ కాలంలో వెనక్కు ప్రయాణించే అవకాశం వస్తే ఏం మారుస్తారు అంటూ ప్రశ్నించగా,  కరోనా వైరస్‌ పై మొదట్లో స్పందించిన తీరు మారుస్తా.

మొదటి నుంచే ఈ వైరస్‌ గురించి సీరియస్‌గా ఆలోచించేలా చర్యలు తీసుకుంటా` అంటూ బదులిచ్చింది. ఆమె సమాధానం మీద కూడా నెటిజెన్లు విరుచుకుపడుతున్నారు. ఎలాంటి సహాయం చేయకుండా ఇలా నీతులు చెప్పటం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.