తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా దుర్భాషలాడుతూ రూపొందించిన వీడియోను నటి శ్రీరెడ్డి ఆమె ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారంటూ సినీ నటి కరాటే కళ్యాణి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చర్యలు ప్రారంభించిన పోలీసులు నిందితురాలిగా పరిగణిస్తూ శ్రీరెడ్డికి నోటీసులు జారీ చేశారు.

వీటిని తీసుకుకొని చెన్నై వెళ్లిన ప్రత్యేక బృందం శుక్రవారం ఆమెకి అందించారు. 2018లో ఓ ఛానెల్ లో జరిగిన చర్చ నేపధ్యంలో కరాటే కళ్యాణి, శ్రీరెడ్డి ఇద్దరూ గొడవ పడ్డారు. దీనికి సంబంధించి శ్రీరెడ్డి హుమాయూన్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ తిడుతోంది.. శ్రీరెడ్డిపై కంప్లైంట్!

ఈ కేసుకి సంబంధించి పోలీసులు ఇటీవల కళ్యాణికి నోటీలు జారీ చేశారు. దీంతో మరోసారి ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. ఈ క్రమంలో శ్రీరెడ్డి, కళ్యాణిపై అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ ఆమెని కించపరిచేలా 20 నిమిషాల నిడివితో రూపొందించిన వీడియోను తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది.

దీంతో కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీరెడ్డి రూపొందించిన వీడియోలో.. 'ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా నేను పట్టించుకోను.. నన్ను అరెస్ట్ చేసినా సరే అంటూ' కొన్ని వ్యాఖ్యలు చేసింది.

అయితే పోలీసులు శ్రీరెడ్డిని సంప్రదించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం, ఆమె చెన్నైలో ఉన్నట్లు తెలియడంతో గురువారం అక్కడకి వెళ్లిన బృందం శుక్రవారం ఆమెకి నోటీసులు అందించింది.