ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై బయోపిక్ కథలు ఏడాదికి పదుల సంఖ్యలో తెరకెక్కుతున్నాయి. నిజ జీవిత కథలకు ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడంతో సినీ ప్రముఖులు పోటీ పడి సినిమాలను నిర్మిస్తున్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. తెలుగు వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి జీవితం కూడా తెరపైకి రానున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.

టాలీవుడ్ సీనియర్ రైటర్ కోన వెంకట్ తన హోమ్ ప్రొడక్షన్ లో సినిమాని తెరకెక్కించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండేళ్ల నుంచి ఈ బయోపిక్ కి సంబందించిన రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇక ఫైనల్ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ని కోన వెంకట్ కాంపౌండ్ కి చేరినట్లు సమాచారం. శ్రీకాకుళంకి చెందిన ఒక సాధరణ మహిళ అంతర్జాతీయా స్థాయిలో వెయిట్ లిఫ్టర్ గా ఎలా ఎదిగింది? అలాగే ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు, చేదు అనుభవాలను తెరపై చూపించనున్నారట.

2000వ సంవత్సరంలో జరిగిన ఒలంపిక్స్ పోటీల్లో మల్లీశ్వరి బ్రోన్జ్ మెడల్ నూయి సాధించి అందరిని ఆకర్షించింది. అలాగే ఖేల్ రత్న అవార్డు సొంతం చేసుకొని తోటి మహిళలకు ఆదర్శంగా నిలిచింది. ప్రస్తుతం సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమాలో కరణం మల్లీశ్వరి పాత్రలో కనిపించాలంటే అంత ఈజీ కాదు. పాత్ర కోసం ఫిట్ నెస్ లో భారీ మార్పులు తీసుకురావాల్సి ఉంటుంది. మరీ ఇలాంటి చాలెంజింగ్ రోల్ లో ఎవరు నటిస్తారో చూడాలి.