రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఏడాది గ్యాప్ లోనే ఊహించని అపజయాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అర్జున్ రెడ్డి - గీత గోవిందం సినిమాల తరువాత ఇలాంటి హీరోతో ఎలాగైనా ఒక సినిమా చేయాలనీ స్టార్ దర్శకులు కూడా అనుకున్నారు అంటే విజయ్ క్రేజ్ ఏ రేంజ్ కి వెళ్లిందో చెప్పనవసరం లేదు. ఇక ఈ మధ్య  వరల్డ్ ఫెమస్ లవర్ మాములు దెబ్బ కొట్టలేదు.

డియర్ కామ్రేడ్ సినిమా తరువాత మంచి సక్సెస్ అందుకోవాలని చూసిన విజయ్ కి ఈ డిఫరెంట్ లవ్ స్టోరీ ఏ మాత్రం కిక్కివ్వలేకపోయింది. దీంతో రౌడీ స్టార్ రేంజ్ తగ్గిందనే రూమర్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు విజవై కి సంబందించిన ఒక ఊహించని వార్త అందరిని షాక్ కి గురి చేస్తోంది. ఎందుకంటె విజయ్ కి 100కోట్ల ఫార్ దక్కినట్లు కథనాలు వెలువడుతున్నాయి.

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ విజయ్ కి వంద కోట్లు ఇచ్చి కొన్ని ప్రాజెక్ట్స్ లాక్ చేయించుకున్నట్లు సమాచారం. విజయ్ తో కంటిన్యూగా కొన్ని సినిమాలను తెరకెక్కించి సౌత్ నార్త్ లో భారీగా రిలీజ్ చేయాలనీ చూస్తున్నాడట. ప్రస్తుతం విజయ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఫైటర్ అనే టైటిల్ తో రూపొందుతున్న ఆ సినిమా షూటింగ్ ఇటీవక మొదలైంది. ఇక ఆ సినిమా తరువాత విజయ్ కరణ్ జోహార్ తో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు టాక్.