బాలకృష్ణ ప్రస్తుతం రూలర్ చిత్రంలో నటిస్తున్నాడు. పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య డిఫెరెంట్ గెటప్ లో కనిపిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. గత ఏడాది సంక్రాంతికి విడుదలైన జైసింహా చిత్రానికి కూడా రవికుమారే దర్శకుడు. వీరిద్దరి కాంబోలో వస్తున్న రెండవ చిత్రం ఇది. 

ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన హాట్ బ్యూటీలు సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి దర్శత్వంలో బాలయ్య తదుపరి చిత్రం ఉండబోతోంది. వాస్తవానికి ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత బాలయ్య, బోయపాటి కాంబోలో సినిమా రావాల్సింది. కానీ కొన్ని కారణాలవల్ల అది జరగలేదు. 

దీనితో బోయపాటి బాలయ్య 106వ చిత్రానికి దర్శత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బోయపాటి ఈ చిత్రం కోసం క్రేజీ కాంబినేషన్ సెట్ చేస్తున్నారు. కన్నడలో క్రేజీ హీరోయిన్ గ దూసుకుపోతున్న 27 ఏళ్ల యంగ్ హీరోయిన్ రచిత రామ్ బాలయ్యతో రొమాన్స్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

బాలయ్య 106వ చిత్రంలో హీరోయిన్ గా బోయపాటి రచిత రామ్ తో సంప్రదింపులు జరుపుతున్నారు. మరో షాకింగ్ సర్ ప్రైజ్ ఏంటంటే.. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన విలన్ రోల్ పోషిస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే బోయపాటి, బాలయ్య హ్యాట్రిక్ మూవీపై అంచనాలు పెరిగిపోవడం ఖాయం. 

జయ జానకి నాయక చిత్రాన్ని నిర్మించిన మిర్యాలగూడ రవీంద్ర బాలయ్య 106వ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం భారీ బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది.