కన్నడ గాయకురాలు సుష్మిత సోమవారం నాడు తన ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అదనపు కట్నం కోసం భర్త అత్తమామల వేధింపులే కారణమని ఆమె ఆత్మహత్యకు ముందు తన తమ్ముడికి వాట్సాప్ మెసేజ్ పంపారు.

బెంగుళూరులోని నాగరబావి ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయారు. పలు కన్నడ చిత్రాలు, సీరియల్స్ ద్వారా సాండల్‌వుడ్‌లో గుర్తింపు పొందిన గాయని సుష్మిత (26) సూసైడ్ చేసుకోవడం నగరంలో సంచలనం సృష్టించింది.

ప్రముఖ నటుడు తపస్ పాల్ మృతి!

సుష్మిత తన తమ్ముడికి పంపించిన మెసేజ్ లో.. 'అమ్మా.. నన్ను క్షమించు, నా భర్త, వాళ్ల బంధువులు నన్ను మానసికంగా చిత్రహింసలు పెడుతున్నారు. అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. నా తప్పుకి నేనే శిక్ష అనుభవిస్తున్నా..' అంటూ రాసుకొచ్చింది.

తన మరణానికి భర్త శరత్ తో పాటు ఇతర బదువులు వైదేహి, గీతలే ప్రధాన కారణమని.. పెళ్లైన ఏడాది నుండే కష్టాలు అనుభవిస్తున్నానని.. తనను వేధించిన ఎవ్వరినీ వదలొద్దు అంటూ మెసేజ్ పెట్టింది. ఈ డెత్ నోట్ ని చూసిన సుష్మిత తల్లితండ్రులు తమ కూతురు సూసైడ్ చేసుకోవడానికి కారణం భర్త, అత్తమామలేనని పోలీసులకు ఫిర్యాదు చేశారు.