Asianet News TeluguAsianet News Telugu

సినీ పరిశ్రమలో మరో విషాదం.. దిగ్గజ నటుడు శివరామ్ మృతి

ప్రముఖ కన్నడ దిగ్గజ నటుడు, నిర్మాత, దర్శకుడు ఎస్.శివరామ్ (83) తుదిశ్వాస విడిచారుశివరాం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనని బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.
 

kannada senior actor and director sivaram passed away
Author
Hyderabad, First Published Dec 4, 2021, 6:24 PM IST

గ‌త కొద్దిరోజులుగా ద‌క్షిణాది చిత్ర సీమ‌లో వరుస విషాదాలు అలుముకుంటున్నాయి. సీనియ‌ర్ కొరియోగ్రాఫ‌ర్  శివశంకర్ మాస్ట‌ర్, మొన్నటికి మొన్న ప్ర‌ముఖ తెలుగు గీత ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. నిన్న టాలీవుడ్ నిర్మాత జ‌క్కుల నాగేశ్వ‌రరావు  రోడ్డు ప్ర‌మాదం లో  క‌న్నుమూశాడు. ఈ విషాద ఛాయాలు చేర‌గ‌క‌ముందే.. మ‌రో మ‌ర‌ణ‌వార్త వినిపించింది.

తాజాగా.. ప్రముఖ కన్నడ దిగ్గజ నటుడు, నిర్మాత, దర్శకుడు ఎస్.శివరామ్ (83) తుదిశ్వాస విడిచారు .  కొన్ని రోజులుగా ఆయ‌న అనారోగ్యంతో బాధపడుతున్నారు. గ‌త రెండు రోజుల క్రితం ఇంట్లో శివరామ్ కళ్లు తిరిగి పడిపోవ‌డంతో త‌లకు తీవ్రమైన‌ గాయ‌మైంది. వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కాగా బ్రెయిన్​లో బ్లీడింగ్​ అయినట్లు గుర్తించిన వైద్యులు ఆయన వయసు కారణంగా సర్జరీ నిర్వహించలేకపోయారని అంటున్నారు. గత రెండు రోజులుగా ఆయనకు చికిత్స అందిస్తున్నప్పటికీ, శివరామ్​ను డాక్టర్లు కాపాడ‌లేక‌పోయారు.

 Read Also: https://telugu.asianetnews.com/entertainment/nandamuri-balakrishna-akhanda-movie-us-box-office-collections-r3htz1
 
శివరామ్ గ‌త ఆరు దశాబ్దాల పాటు క‌న్న‌డ చిత్ర సీమ‌కు సేవ‌లందించారు. కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా, హాస్య పాత్రలు, సహాయపాత్రల్లో న‌టించి.. క‌న్న‌డ ప్రేక్ష‌కుల మ‌దిలో సుసిర్థ స్థానాన్ని సంపాదించుకున్నారు. శివరామ్ జనవరి 28, 1938న జన్మించారు. అతను తొలుత 1958లో సహాయ దర్శకుడిగా క‌న్న‌డ సినీ పరిశ్రమలో ఎంటర్ అయ్యారు. 

ఈ స‌మ‌యంలో ఆయ‌న  కేఆర్ సీతారామశాస్త్రి, పుట్టన్న కనగల్, సింగీతం శ్రీనివాసరావు వద్ద పనిచేశారు.ఆ త‌రువాత 1965లో బెరెతా జీవా సినిమాతో నటుడిగా వెండి తెర‌కు ప‌రిచ‌య‌మ్యారు. ఆయ‌న అమితాబ్ బచ్చన్, కమల్​హాసన్, రజనీకాంత్ లాంటి ప్ర‌ముఖ హీరోలతో న‌టించి , మెప్పించారు. ఆయ‌న‌ 90కి పైగా సినిమాల్లో నటించారు. 

 Read Also: https://telugu.asianetnews.com/entertainment/tollywood-producer-jakkula-nageswara-rao-passes-away-r3hvjp

ఈ క్ర‌మంలోనే  త‌న సోదరుడు ఎస్. రామనాథన్​తో కలిసి పలు సినిమాలను నిర్మించారు. ఆయ‌న నిర్మించిన తొలి సినిమా ‘హదయ సంగమ’. ఈ సినిమా 1972లో విడుద‌లైంది. ఈ క్ర‌మంలో ఆయ‌న‌ ఎన్నో అవార్డులు , రివార్డులు అందుకున్నారు. క‌న్న‌డ చిత్ర‌సీమ‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన డాక్టర్.రాజ్​కుమార్ లైఫ్​టైమ్ అచీవ్​మెంట్​ అవార్డును శివరామ్ అందుకున్నారు.  అలానే 2013లో పద్మభూషణ్ డాక్టర్ బీ.సరోజిని జాతీయ అవార్డు కూడా శివరామ్ ను వరించింది.

 ఆయ‌న మ‌ర‌ణ‌వార్తతో క‌న్న‌డ చిత్ర‌సీమ విషాదంలో మునిగింది. నటుడు శివరామ్ అకాల మరణంతో ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.  ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకురాల‌ని ప్ర‌ముఖులు నివాళులర్పిస్తున్నారు. ఈ క్ర‌మంలో కన్నడ సినీ ప్రముఖుడు శివరాం మరణం చాలా బాధాకరం. కన్నడ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయారని కన్నడ ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ట్వీట్ చేశారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని, ఆయన కుటుంబ సభ్యులకు శాంతి చేకూరాలని ట్వీట్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios