కన్నడ సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచిన పాన్ ఇండియన్ మూవీ KGF ఛాప్టర్ 1. సినిమా కోసం దర్శకుడు ఇతర టెక్నీషియన్స్ ఎంతగా కష్టపడ్డారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అలాగే సినిమాలో కనిపించిన నటీనటులు కూడా వారి టాలెంట్ తో సినిమా స్థాయిని పెంచారు. యష్ తో పాటు ప్రతి ఒక్క నటుడు సినిమాలో హైలెట్ అయ్యాడని చెప్పవచ్చు.

ప్రస్తుతం సినిమాకు సంబందించిన సెకండ్ పార్ట్ షూటింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. సమ్మర్ ఎండింగ్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలని దర్శకుడు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. పార్ట్ 1 సినిమాలో నటించిన ప్రముఖ నటుడు విబేధాల కారణంగా రెండవ భాగం నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. కన్నడ సీనియర్ నటుడు అనంత్ నాగ్ KGF 1లో సీనియర్ జర్నలిస్ట్ గా కనిపించిన విషయం తెలిసిందే.

అయితే ఇటీవల దర్శకుడితో క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చి షూటింగ్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. 'గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస" అంటూ అనంత్ నాగ్ చూపించిన హవాబావలు కథను ఆయన పాత్రతోనే నడిపించడం సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలిచింది. అయితే ఇప్పుడు ఆయన నెక్స్ట్ పార్ట్ లో లేకపోవడంతో సినిమాపై ఎంతో కొంత ఎఫెక్ట్ పడుతుంది. మరీ దర్శకుడు ఎలాంటి స్క్రీన్ ప్లే తో వస్తాడో చూడాలి.