బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ గత నెలలో పెద్ద కలకలమే రేపింది. అందం నుంచి మార్చి 10 న కనికా ఇండియాకు వచ్చిన సంగతి తెలిసిందే. మార్చి 20న ఆమెకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ లోపు ఆమె పార్టీల పేరుతో లక్నోలో విచ్చలవిడిగా తిరిగింది. 

విదేశాల నుంచి వచ్చిన వారు క్వారంటైన్ లో ఉండాలనే ప్రభుత్వ నిబంధనల్ని పట్టించుకోలేదు. దీనితో కనికా కపూర్ పై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. ఇటీవల కనికా కపూర్ కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. 

ప్రభుత్వ నిబంధనల్ని పాటించకుండా కనికా పార్టీలలో పాల్గొన్నందుకు గాను ఆమెపై పలు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం పోలీసులు ఆమెని విచారించేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా కనికా కపూర్ కు నోటీసులు కూడా పంపారు. తన వివరణని రికార్డ్ చేసి పంపాలని పోలీసులు ఆదేశించారు. 

ఇదిలా ఉండగా కనికా కపూర్ మాత్రం సాకులు చెబుతోంది. తాను లండన్ నుంచి వచ్చినప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని, ఎలాంటి కరోనా లక్షణాలు లేవని తెలిపింది. అందువల్లే తాను ముంబై నుంచి లక్నో వెళ్లానని తెలిపింది. డొమెస్టిక్ విమానాలలో ఎలాంటి స్క్రీనింగ్ లేదని, అందువల్ల తనకు కరోనా ఉండనే విషయం తెలియలేదని వంకలు పెడుతోంది. 

అసలు విదేశాల నుంచి వచ్చిన వారు ఎట్టి పరిస్థితుల్లో సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలనేది నిబంధన. అలాంటప్పుడు పోలీసులకు కనికా చెబుతున్న సాకులు ఎలా చెల్లుతాయో చూడాలి.