ట్విటర్ వేదికగా రంగోలి చండల్‌ చేసే కామెంట్స్ కూడా వివాదాస్పదమయ్యాయి. దీంతో ట్విటర్ కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తుందన్న కారణంతో ఆమె ట్విటర్‌ అకౌంట్‌ను సస్పెండ్ చేసింది ట్విటర్‌ సంస్థ.

బాలీవుడ్‌ లేడీ సూపర్‌ స్టార్ కంగనా రనౌత్ తన సినిమాలతో ఏ స్థాయిలో పేరుతెచ్చుకుందో.. వివాదాలతోనూ అదే స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. కంగనా లాగే ఆమె చెల్లెలు రంగోలి చండల్‌ కూడా ఎన్నో వివాదాల్లో తల దూర్చింది. ముఖ్యంగా కంగనాను విమర్శించే వారి విషయంలొ కాస్త ఘాటుగానే స్పందిస్తుంది రంగోలి. కంగానాను డిఫెండ్‌ చేసేందుకు చాలా మంది ప్రముఖుల మీద దారుణమైన కామెంట్స్ చేసింది ఈ భామ. కొన్ని సందర్భాల్లో హద్దులు మీరి కామెంట్స్ చేయటంతో అవి కేసుల వరకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి.


ట్విటర్ వేదికగా ఆమె చేసే కామెంట్స్ కూడా వివాదాస్పదమయ్యాయి. దీంతో ట్విటర్ కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తుందన్న కారణంతో ఆమె ట్విటర్‌ అకౌంట్‌ను సస్పెండ్ చేసింది ట్విటర్‌ సంస్థ. అయితే ఆమె ట్విటర్‌ అకౌంట్‌ను సస్పెండ్ చేయటంపై పలువురు ప్రముఖులు స్పందించారు. కొందరైతే రంగోలి ట్విటర్‌ ను సస్పెండ్ చేసినందుకు ట్విటర్‌ సంస్థకు కృతజ్ఞతలు తెలియజేశారు.

మరికొందరైతే మేము గతంలో రంగోలి మీద పోలీసులకు కూడా కంప్లయింట్ ఇచ్చాయి. ఇప్పటికైనా చర్యలు తీసుకున్నందుకు సంతోషం అంటూ స్పందించారు. మరి ఈ పరిణామంపై రంగోలి ఎలా స్పందిస్తుందో చూడాలి. 
Scroll to load tweet…