సూపర్‌ స్టార్ మహేష్ బాబు కెరీర్‌ను మలుపు తిప్పిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ పోకిరి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 70 ఏళ్ల తెలుగు సినిమా రికార్డ్‌లను తిరగరాసింది. ప్రకాష్ రాజ్ ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడిగా ఇలియానా నటించింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా మొదటి చాయిస్ ఇలియానా కాదట. ముందగా ఓ  బాలీవుడ్‌ బ్యూటీని సంప్రదించిన తరువాత కుదరక ఇలియానాను తీసుకున్నారట.

ఈ విషయాన్ని పోకిరి ని మిస్ అయిన ఆ బాలీవుడ్ బ్యూటీనే స్వయంగా వెళ్లడించింది. ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు. మోస్ట్ కాంట్రవర్షియల్ బాలీవుడ్‌ భామ కంగనా రనౌత్‌. మంగళవారానికి ఈ సినిమా రిలీజ్‌ అయిన 14 ఏళ్లు  పూర్తయిన సందర్భంగా మరోసారి పోకిరి సినిమా మీద దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ గురించి ఆసక్తికర వార్త బయటకు వచ్చింది.

గతంలో ఓ ఇంటర్వ్యూలో పోకిరిలో హీరోయిన్ చాన్స్ మిస్ అవ్వటంపై కంగనా రనౌత్‌ ఆసక్తికర వ్యాక్యలు చేసింది. ఈ సినిమాలో మహేష్కు జోడిగా ముందుగా కంగనాను సంప్రదించాడు పూరి. కానీ ఆ సమయంలో కంగనా గ్యాంగ్ స్టర్స్‌ అనే సినిమా పనుల్లో బిజీగా ఉండటంతో పోకిరికి నో చెప్పింది. తరువాత ఆ స్థానంలో ఇలియానాను తీసుకోవటం. ఈ సినిమా వల్లే ఇలియానా టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్‌ అందుకోవటం తెలిసిందే. అయితే పోకిరి మిస్ అయినా.. పూరి తెరకెక్కించిన ఏక్ నిరంజన్‌ సినిమాలో నటించి మెప్పించింది కంగనా.
Kangana Ranaut sends legal notice to Forbes India for putting her ...