యంగ్ టాలెంటెడ్ దర్శకుడు వెంకటేశ్ మ‌హా తొలి ప్రయత్నం ‘కేరాఫ్ కంచరపాలెం’. కొత్త నటులతో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది సెప్టెంబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఈ చిత్రం కమర్షియల్ హంగులతో గిరిగీసుకున్న తెలుగు సినిమా కంచెలను చెరిపేసే ప్రయత్నం చేసిందనే చెప్పాలి. విడుదలకు ముందే న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌కు ఎంపికైన ఈ చిత్రాన్ని తెలుగులో సురేష్ ప్రొడక్షన్‌లో రానా విడుదల చేస్తే మంచి విజయం సాధించింది.

వైజాగ్ కంచెరపాలెం నేపథ్యంలో సాగే భిన్నమైన ప్రేమకథా చిత్రమిది.   ‘కేరాఫ్‌ కంచరపాలెం’ బడ్జెట్‌ విషయంలో చిన్న సినిమానే అయినా ప్రేక్షకాదరణలో మాత్రం పెద్ద సినిమాలకు ఏ మాత్రం తక్కువ కాకపోవటంతో ఆయన తదుపరి చిత్రం కోసం చాలా మంది మీడియా సైతం ఎదురుచూస్తోంది.  ఈ నేపధ్యంలో ఆయన తదుపరి చిత్రం గురించిన వార్త బయిటకు వచ్చింది. ఆయన ఈ సారి తన సొంత కథతో కాకుండా ఓ రీమేక్ తో మన ముందుకు రాబోతున్నారు.

''చిరంజీవి గిరంజీవి.. బాలయ్య ముందు సరిపోరు''

మలయాళ సూపర్‌ హిట్‌ చిత్రం ‘మహేషింటె ప్రతీకారం’ చిత్రం వెంకటేష్ మహాకు బాగా నచ్చటంతో  రీమేక్‌  చేస్తున్నారు. ‘మహేషింటె ప్రతీకారం’లో చిత్రం ఫాహద్‌ ఫాజల్‌ ముఖ్యపాత్ర చేశారు. తెలుగు రీమేక్‌లో ఆయన పాత్రను సత్యదేవ్‌ చేస్తున్నారు. నవంబర్‌లో ఈ సినిమా  షూటింగ్  పూర్తవుతుందని సమాచారం. ‘మహేషింటె ప్రతీకారం’ సినిమాకి జాతీయ అవార్డు లభించింది. తమిళంలో ఈ సినిమాను దర్శకుడు ప్రియదర్శన్‌ రీమేక్‌ చేశారు.