సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర నుండి మొదలైన వివాదాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. సినిమా టైటిల్ మాత్రమే కాకుండా కథ మొత్తం ఏపీ ప్రస్తుతం రాజకీయాల మాదిరి ఉందని సినిమాని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాపై కోర్టులో చాలా పిటిషన్లు వేశారు. సినిమా రిలీజ్ ని ఆపాలని కోర్టుని కోరారు. రేపు రిలీజ్ పెట్టుకొని ఇప్పటివరకు సినిమా సెన్సార్ కార్యక్రమాలు జరగలేదు. దీంతో సినిమా వివాదంపై వర్మ కోర్టులో పిటిషన్ వేశారు.

రాంచరణ్ ప్లాన్ కు హీరోలంతా ఒప్పుకుంటారా!

తన సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేలా.. సెన్సార్ బోర్డ్ ని ఆదేశించాలని రామ్ గోపాల్ వర్మ కోర్టుని కోరారు. సినిమాను ఇప్పటివరకు సెన్సార్ బోర్డ్ చూడలేదని వర్మ చెప్పారు. రేపు సినిమా విడుదల ఉన్నా.. ఇప్పటివరకు  సర్టిఫికేట్ ఇవ్వలేదని వర్మ అభ్యంతరం చెబుతున్నారు.

దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. వారంలోగా సినిమా చూడాలని సెన్సార్ బోర్డ్ కి ఆదేశాలు జారీ చేసింది. అభ్యంతరాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలని ధర్మాసనం తెలిపింది. రెండు కులాల మధ్య చిచ్చు రగిల్చే టైటిల్ మార్చాల్సిందేనని హైకోర్టు చెప్పడంతో.. టైటిల్ మారుస్తామంటూ సెన్సార్ బోర్డ్ కు తెలిపామని వర్మ చెప్పారు. ఈ క్రమంలో రేపు విడుదల కావాల్సిన సినిమా ప్రస్తుతానికి వాయిదా పడింది.