వివాదాస్పద వ్యాఖ్యలు, చిత్రాలతో నిత్యం వార్తల్లో వర్మ కనిపిస్తుంటాడు. ఈ ఏడాది లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంతో రాంగోపాల్ వర్మ సృష్టించిన వివాదాలు అన్నీ ఇన్నీ కావు. ఆ చిత్రాన్ని మరిచిపోక ముందే వర్మ 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే చిత్రాన్ని ప్రకటించాడు. 

తాజాగా ఈ చిత్రం గురించి వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అక్టోబర్ 27న ఉదయం 9:36 గంటలకు 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' చిత్ర ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు వర్మ ప్రకటించాడు. 

ఈ నేపథ్యం వర్మ రిలీజ్ చేస్తున్న పోస్టర్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి. వైస్ జగన్ పాత్రలో యువ నటుడు అజ్మల్ అమీర్ నటిస్తున్నాడు. అద్భుతమైన హావభావాలతో అజ్మల్ జగన్ పాత్రలో ఒదిగిపోయాడు. ఇక పోస్టర్స్ లో మాజీ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ని పోలిన పాత్రలు కూడా కనిపిస్తున్నాయి. 

తరచుగా వర్మ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చూస్తూనే ఉన్నాం. ఈ చిత్రంలో కూడా పవన్ పాత్రని వెటకారంగా చూపించబోతున్నట్లు చర్చ జరుగుతోంది. ఇదే కనుక జరిగితే పవన్ అభిమానులు, వర్మ మధ్య మరోమారు వార్ మొదలైనట్లే.