భారత సంతతికి చెందిన ఇంగ్లీష్ నటీమణి కరోనా వైరస్ భారిన పడింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఎవ్వరిని వదలడం లేదు. ఎంతో జాగ్రత్తగా ఉండే సెలబ్రెటీలు ఓ వైపు జనాలకు జాగ్రత్తలు చెబుతూనే సడన్ గా వ్యాధి భారిన పడుతున్నారు. ఇక ఎవరు ఊహించని విధంగా గేమ్ ఆఫ్ త్రోన్స్, కామసూత్ర నటి ఇందిరా వర్మ కి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది.

 

రీసెంట్ గా తీవ్ర అస్వస్థతకు గురైన ఇందిరా మొదటి రెండు రోజులు పెద్దగా పట్టించుకోలేదట. ఇక జ్వరం డోస్ పెరగడంతో వెంటనే హాస్పిటల్ లో జాయిన్ అవ్వగా ఆమెకి కోవిడ్ -19 ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్యులు నిర్దారించారు. మొదట్లోనే ఆమె వైద్యులను సంప్రదించి ఉంటే వైరస్ తొందరగా నయం అయ్యేదని వైద్యులు చెబుతున్నారు. ఇందిరా నిర్లక్ష్యం కారణంగా వైరస్ ఆమె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.

 

అయితే డాక్టర్లు నిరంతరం ఆమెకు ఒకరోజు వైద్య పరీక్షలు నిర్వహించడం వలన వైరస్ నుంచి కొలుకుంటున్నట్లు సమాచారం. ఇందిరా వర్మకి పాజిటివ్ అని తెలియగానే సినీ తారలు ఆమె త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా కామెంట్ చేస్తున్నారు. ఇక ఇటీవల హాలీవుడ్ స్టార్ యాక్టర్స్ టామ్ హాంక్స్ తో పాటు ఆయన సతీమణి రీటా విల్సన్ కూడా కరోనా భారిన పడ్డారు. వారు వ్యాధి నుండి వెంటనే కొలుకున్నారు. ప్రస్తుతం ఇంద్రిస్ ఏల్బా - రాచెల్ మత్యుస్ వంటి మరికొందరు కరోనా నివారణకు చిక్కిత్స తీసుకుంటున్నారు.