పోలీసుల నిరంతర విచారణకు కమల్ హాసన్ అసహనం వ్యక్త్తం చేశారు, ఇటీవల జరిగిన ఇండియన్ 2 యాక్సిడెంట్ విషయంలో పోలీసులు వేధిస్తున్నారని కోర్టుకు వెళ్లారు. శంకర్ - కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారతీయుడు 2 షూటింగ్ లో ఇటీవల ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.

 

చెన్నై లో జరిగిన ఘటనలో ఇద్దరు సహాయక దర్శకులు, మరొక స్టాఫ్ మెంబర్ అక్కడిక్కడే మృతి చెందగా మరికొందరు తీవ్ర గాయాలతో చిక్కిత్స పొందుతూన్నారు. భారీ క్రేయిన్ అనుకోకుండా విరిగిపడటంతో ప్రమాదం జరిగింది.దీంతో చెన్నై పోలిసులు దర్శక నిర్మాతలతో పాటు హీరోపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

అయితే ఘటన విషయంలో కథానాయకుడు కమల్ హాసన్ పోలీసుల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నట్లు మద్రాస్ కోర్టులో పిల్ దాఖలైంది. అత్యవసర విచారణకు న్యాయస్థానం కమల్ వినతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏ విషయంపై ఏ విధంగా స్పందిస్తుంది అనేది తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది.