సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది స్టార్ హీరోయిన్స్ ఉన్నా ప్రస్తుతం అనుష్క తరువాతే ఎవరైనా. వయసుతో సంబంధం లేకుండా స్టార్ హీరోలతో సమానంగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న దేవసేన త్వరలో నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ పనులన్నీ పూర్తయ్యాయి. ప్రీ ప్రొడక్షన్ ఎండ్ అవుతున్న సమయంలో సినిమాకు కరోనా ఎఫెక్ట్ గట్టిగానే పడింది.

 

రిలీజ్ డేట్ వాయిదా వేసుకున్న చిత్ర యూనిట్ మరికొన్ని రోజులు వెయిట్ చేసే ఛాన్స్ ఉంది. అసలు మ్యాటర్ లోకి వస్తే.. అనుష్క నిశ్శబ్దం తరువాత ఎలాంటి సినిమా చేస్తుందనే విషయం హాట్ టాపిక్ గా మారింది. సింగీతం శ్రీనివాసరావు గారు రీసెంట్ గా అనుష్కకు ఒక ప్రముఖ మహిళ బయోపిక్ కి సంబంధించిన స్క్రిప్ట్ గురించి చర్చించారట. ఆ సినిమా సెట్స్ పైకి రావడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఇక కమల్ హసన్ తో కూడా జేజమ్మ యాక్ట్ చేయబోతున్నట్లు సమాచారం. గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో 2006లో వచ్చిన రాఘవన్ సినిమాకు సీక్వెల్ రెడీ చేసేందుకు  ప్రయత్నిస్తున్నట్లు టాక్. 

అందులో అనుష్క హీరోయిన్ గా నటించనుందట. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఆ సినిమాను రెండు నెలల్లో మొదలుపెట్టాలని అనుకున్న గౌతమ్ కి కరోనా ఆంక్షలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఇకపోతే కమల్ హసన్ కూడా ఇప్పుడు సిధ్ధంగా లేడు. ఇండియన్ 2 యాక్సిడెంట్ తో ఓటు కరోనా ఆంక్షలు ఆ సినిమాకు కోలుకోలేని దెబ్బకొట్టాయి. దీంతో ఇండియన్ 2 షూటింగ్ ఒక కొలిక్కి వచ్చిన అనంతరం కమల్ పెద్దగా హడావుడి లేకుండా సైలెంట్ తన కొత్త ప్రాజెక్టును స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు. మరి ఆ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.