కమల్ కు గత కొద్ది రోజులుగా ఏమీ కలిసి రావటం లేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలెట్టిన శభాష్ నాయుడు షూటింగ్ ఆగిపోయింది. ఆ షూటింగ్ సమయంలో ఆయనకు మేజర్ యాక్సిడెంట్ అయ్యింది. దాన్ని ప్రక్కన పెట్టి రాజకీయాల్లోకి వస్తే డిపాజిట్లు దగ్గలేదు. మళ్లీ ఫామ్ లోకి రావటం కోసం...భారతీయుడు సీక్వెల్ షూటింగ్ మొదలెడితే అదీ ఓ పెద్ద విషాదం గా మారింది. చాలా కాలం వాయిదాపడుతూ వచ్చిన  ‘ఇండియన్ 2’ షూటింగులో ప్రమాదం జరిగింది. ఈ  ప్రమాదం విషయంలో పోలీసులు దర్శకుడు శంకర్‌తో పాటు కమల్‌కు కూడా నోటీసులు జారీ చేసారు.

ఆ  సంగతి మర్చిపోకముందే మరో వివాదంలో కమల్ కలిసింది.ఇప్పుడు ఆయన క్షమాపణ చెప్పాల్సిందే అంటూ డిమాండ్స్ మొదలయ్యాయి. మరికొంతమంది నెట్ జనులు మీటూ అంటూ గోల మొదలెట్టారు. ముఖ్యంగా కమల్ యాంటీ ఫ్యాన్స్, అలాగే ఆయన్ని రాజకీయంగా ప్రక్కకు నెట్టాలనుకునేవాళ్లు ఈ ఇష్యూని పెద్దది చేస్తున్నారు. ఆడవాళ్ల విషయంలో కమల్ బిహేవియర్ ఇలా ఉంటుంది అని ఈ సంఘటనతో నొక్కి చెప్పాలని వారి తాపత్రయం.

కమల్ హాసన్ బలవంతంగా ముద్దు పెట్టారు.. సీనియర్ నటి కామెంట్స్!

ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం జరిగిన దానికి ఇన్నాళ్లు తర్వాత వివాదం ఏమిటి...అని కమల్ ఫ్యాన్స్ తలపట్టుకుంటున్నారు. దీని అంతటికి కారణం తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమిళ సీనియర్ నటి రేఖ చేసిన కామెంట్స్.. ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారటమే.

అప్పట్లో అంటే 1986లో బాలచందర్ రూపొందించిన ‘పున్నగాయ్ మన్నన్’  సినిమాలో రేఖ, కమల్ హాసన్ జంటగా నటించారు. ఆ సినిమాలో వీరిద్దరి మధ్య ఓ ముద్దు సన్నివేశం ఉంది. ఆ ముద్దు సన్నివేశం గురించి తనకు ముందుగా చెప్పలేదని, తన అనుమతి లేకుండానే కమల్ తనకు ముద్దు పెట్టేశారని రేఖ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. దాంతో ఎలాగైనా సరే... రేఖకు కమల్ బహిరంగ క్షమాపణ చెప్పాలి అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తుంటే మరికొందరు ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం ముద్దు పెడితే ఇప్పుడు సారీ చెప్పాలా అంటూ ప్రశ్నిస్తున్నారు.