కమల్ హాసన్ జనమ్ జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగాయి. ఆయన కుమార్తెలు శృతి హాసన్, అక్షర హాసన్.. పెద్దన్నయ్య చారుహాసన్, ఇతర కుటుంబసభ్యులు జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. తన 65వ బర్త్ డే సందర్భంగా కమల్ హాసన్ పలు విషయాలని మీడియాతో పంచుకున్నారు. 

ఈ సందర్భంగా ప్రజెంట్ జనరేషన్ లో ఉత్తమ నటులు ఎవరు అని ప్రశ్నించగా కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా జనరేషన్ లో నాతో పాటు తెలుగు, తమిళ భాషల్లో మంచి నటులు చాలామందే ఉన్నారు. కానీ ఈ తరం నటుల్లో మాత్రం నాకు నచ్చినవారు ముగ్గురే. 

హిందీలో నవాజుద్దీన్ సిద్దిఖీ, మలయాళంలో ఫహద్ ఫాజిల్ నటన తనకు ఇష్టం అని కమల్ తెలిపాడు. ఇక మరో హిందీ యువ నటుడు శశాంక్ అరోరా నటన కూడా తనకు ఇష్టం అని కమల్ తెలిపారు. శశాంక్ చాలా చిన్న వయసులోనే నటనలో పరిపక్వత ప్రదర్శించాడు. అతడి నటనకు నేను ఇంప్రెస్ అయ్యా అని కమల్ పేర్కొన్నారు. 

ఇండియాలో శశాంక్ ఐకానిక్ యాక్టర్ అవుతాడని కమల్ ప్రశంసించారు. కానీ తెలుగు, తమిళ భాషల్లో కమల్ ఒక్క నటుడి పేరుని కూడా ప్రస్తావించలేదు.